Advertisementt

‘బీబీ3’ చిత్రానికి కృష్ణవంశీ చిత్ర టైటిల్?

Tue 21st Jul 2020 06:16 PM
danger,balakrishna,boyapati,krishnavamsi,title,bb 3  ‘బీబీ3’ చిత్రానికి కృష్ణవంశీ చిత్ర టైటిల్?
Krishna Vamsi Movie title for Balayya and Boyapati film ‘బీబీ3’ చిత్రానికి కృష్ణవంశీ చిత్ర టైటిల్?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ కరుణించినా కరోనా కష్టాలు ఎదుర్కుంటున్న బోయపాటి శీను.... కరోనా వదిలి ఎప్పుడెప్పుడు బాలయ్యని తీసుకుని సెట్స్ మీదకెల్దామా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మూడోసారి తెరకెక్కబోతున్న ఈ కాంబోపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. కరోనా లాక్ డౌన్ కన్నా ముందు ఓ పది రోజులు షూటింగ్ చేసిన బోయపాటి బాలయ్యని ఎలా చూపించబోతున్నాడనేది నిమిషంన్నర టీజర్ లోనే చూపించెయ్యడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమాలో బాలయ్యని పవర్ ఫుల్ హీరోగా చూపిస్తాడని, సెకండ్ కేరెక్టర్ చాలా శక్తివంతంగా ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది.

బాలయ్య సెకండ్ కేరెక్టర్ విషయంలో బోయపాటి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాడని, బాలయ్య అఘోరాగా కనిపించబోయే సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయట. ఇక ఈ సినిమా టైటిల్ గా నిన్నమొన్నటివరకు మోనార్క్, సూపర్ మ్యాన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా బాలయ్య - బోయపాటి సినిమా టైటిల్ విషయంలో మరో టైటిల్ ప్రచారంలోకొచ్చింది. అది కృష్ణవంశీ చిత్రం ‘డేంజర్’ టైటిల్ ని బాలయ్య కోసం బోయపాటి పరిశీలిస్తున్నట్టుగా టాక్. కృష్ణవంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్, సాయి, కలర్స్ స్వాతి కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో యావరేజ్ గా ఆడింది. ఇప్పుడు అదే టైటిల్ ని బోయపాటి, బాలయ్య కోసం సెట్ చేస్తున్నాడనే టాక్‌తో నందమూరి అభిమానులు బెంబేలెత్తుతున్నారు. మరి బాలకృష్ణ కోసం కొత్తగా ముంబై మోడల్‌ని దింపుతున్న బోయపాటి బాలయ్యకి ఏ టైటిల్ సెట్ చేస్తాడో అనే సస్పెన్స్ మాత్రం బాగా ఉంది.

Krishna Vamsi Movie title for Balayya and Boyapati film:

Danger Title to Balayya and Boyapati film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ