Advertisementt

వెబ్ సిరీస్ ని రెడీ చేస్తున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్..

Mon 20th Jul 2020 03:12 PM
sandeep reddy vanga,arjun reddy,ranbir kapoor,web series  వెబ్ సిరీస్ ని రెడీ చేస్తున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్..
Sandeep Vanga next would be web series వెబ్ సిరీస్ ని రెడీ చేస్తున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్..
Advertisement
Ads by CJ

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆ సినిమానే హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించింది. తెలుగులో లాగే హిందీలోనూ ఈ సినిమా సంచలనంగా మారింది. ఈ ఒక్క సినిమాతో సందీప్ వంగా, బాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. అయితే సందీప్ వంగా నెక్స్ట్ చిత్రమై ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా తర్వాతి చిత్రం తెరకెక్కుతుందంటూ, దాని పేరు డెవిల్ అని ప్రచారం కూడా సాగింది. కబీర్ సింగ్ నిర్మాతలే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని అన్నారు. అయితే ఈ ప్లాన్లన్నీ కరోనా కారణంగా తల్లకిందులైపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగ్ అంటేనే భయపడుతున్నారు. అదీగాక ముంబైలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. దీంతో ఇప్పట్లో సందీప్ వంగా బాలీవుడ్ సెకండ్ మూవీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడట. ఈ వెబ్ సిరీస్ లో స్టార్ హీరోయిన్ నటిస్తోందని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటిస్తారట.

Sandeep Vanga next would be web series:

Sandeep Vanga next would be web series

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ