Advertisementt

పూరీ జగన్నాథ్ మ్యూజింగ్స్.. అందుబాటులోకి..

Mon 20th Jul 2020 11:58 AM
puri jagannadh musings,fighter,vijay devarakonda  పూరీ జగన్నాథ్ మ్యూజింగ్స్.. అందుబాటులోకి..
Puri Jagannadh musings available on పూరీ జగన్నాథ్ మ్యూజింగ్స్.. అందుబాటులోకి..
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు తీసే ఒకే ఒక్క డైరెక్టర్.. పూరీ జగన్నాథ్. పూరీ సినిమాల్లో హీరోయిజం పీక్స్ లో ఉంటుంది. ఆయన డైలాగులు గునపంలా దిగిపోతుంటాయి. హీరో ఎవ్వరైనా సరే, పూరీ సినిమా అనగానే అప్పటి వరకూ అతని గెటప్ పూర్తిగా మారిపోతుంటుంది. పోకిరి సినిమాలో మహేష్ బాబు నుండి ఇస్మార్ట్ శంకర్ లో రామ్ వరకూ అందరినీ ఎలా చూపించాడో తెలిసిందే.

తన కెరీర్లో చాలా సార్లు పడుతూ లేస్తూ మళ్లీ పడుతూ మళ్లీ లేస్తూ ఆపకుండా సినిమాలని తీస్తూనే ఉన్నాడు. గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పూరి జగన్నాథ్, ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. అయితే తాజాగా పూరి జగన్నాథ్ లేటెస్ట్ అప్డేట్ తో బయటకి వచ్చాడు. 

పూరి జగన్నాథ్ మ్యూజింగ్స్ ని అందుబాటులోకి తెచ్చాడు. తన గొంతుకతో తాను వినిపించిన ఈ మ్యూజింగ్స్ స్పోటిఫై, ఆపిల్ పాడ్ కాస్ట్ లలో అందుబాటులో ఉన్నాయట. వేరు వేరు టాపిక్ లపై తన భావాలను ఇలా బయట పెట్టాడు. ఈ మేరకు ఈ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడి చేసాడు.

Puri Jagannadh musings available on:

Puri Jagannadh musings available on

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ