ఈ మాటన్నది ఎవరో కాదు.. దర్శకుడు పూరి జగన్నాధ్. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడైనా ఆయన ప్లాప్స్ లో ఉన్నప్పుడు పూరితో సినిమాలు చేసేందుకు ఏ స్టార్ హీరో అవకాశం ఇవ్వలేదు. రెండు బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన మహేష్ బాబుతో పూరి జగన్నాధ్ జనగణమన సినిమా చేద్దామని... భంగ పడడంతో మహేష్ పై పూరి కోపం పెంచుకోవడమే కాదు.... అవకాశం ఉన్నప్పుడల్లా మహేష్ మీద సెటైరికల్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. మహేష్ మాత్రం మంచి కథ దొరికితే పూరితో ఫ్యూచర్ లో సినిమా ఉంటుంది అని అంటున్నాడు. స్టార్ డమ్ ఉన్న దర్శకుడిని స్టార్ హీరోలు చూస్ చేసుకుంటున్నారు కానీ.. ప్లాప్స్ లో ఉన్న దర్శకుడిని పట్టించుకోవడం లేదు.
టాలీవుడ్ ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉందేమో అనిపిస్తుంది. నేను అయితే నేను రాసుకున్న కథకి... ఆ హీరో ఈ హీరో అని లేదు.. ముందు సినిమా తీయాలనే ఉంటుంది. ఆ కథ ఆ హీరోకి బావుంటుంది అని అనుకుంటాం కానీ.. అన్ని సందర్భాల్లో మనం అనుకున్నది జరగదు. అలాంటి టైం లో నా కథకు సరిపోయే కొత్త హీరోతో అయినా సినిమా టేక్ అనేందుకు నేను రెడీగా ఉంటాను. స్టార్ హీరోతో ఆ సినిమా చేస్తే మార్కెట్ వేల్యూ బావుంటుంది. అదే కొత్త హీరో అయితే ఆ మార్కెట్ డౌన్ అవుతుంది. అయితే ఏమవుతుంది. స్టార్ హీరోతో చేసిన కొత్త హీరోతో చేసిన. .. మార్కెట్ లో బడ్జెట్ లో తేడా ఉంటుందేమో కానీ.. అవుట్ ఫుట్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుంది అంటున్నాడు పూరి.
నీ కోసమే కథ రాసుకుని.. నీతోనే సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నా.. నువ్వు లేకపోతే నాకు దిక్కులేదు.. అనే క్యారెక్టర్ కాదు నాది, అలాంటి మాట నా లైఫ్ లోనే ఉండదు. కొత్త వాళ్లతో అయినా సినిమా చేస్తా.. హిట్ కొడతా.. పని లేకపోతె నాకు తోచదు. అందుకే సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంటాను. పని చేస్తే యాక్టీవ్ గా ఉంటాను. పనిలేకపోతే జబ్బులు, జ్వరాలు వస్తాయి కానీ... పని ఉంటే అలాంటివి మన దరి చేరవు అంటూ పూరి జాగనాధ్ ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి ఏడాది అయినా సందర్భంగా మాట్లాడుతూ చెప్పిన మాటలివి.