Advertisementt

బిగ్ బాస్ 4 త్వరలో ఈ కండీషన్లతో..!

Sun 19th Jul 2020 06:14 PM
new rule,bigg boss 4,telugu season,celebriteis,corona test  బిగ్ బాస్ 4 త్వరలో ఈ కండీషన్లతో..!
Bigg Boss 4 Latest Update బిగ్ బాస్ 4 త్వరలో ఈ కండీషన్లతో..!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ వెళ్లాలంటే ఓ 100 రోజులో, ఓ 80 రోజులకో అగ్రిమెంట్ చేసుకోవాలి. కొంతమంది షో మిడిల్ నుండి బయటికి రావడానికి, కొంతమంది షో చివరివరకు కొనసాగడానికి యాజమాన్యంతో కలిసి ఏదో చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 మొదలవ్వాల్సింది కరోనా కారణంగా ఇంకా మొదలు కాలేదు. బుల్లితెరపై బిగ్ బాస్ మంచి టీఆర్పీస్ తెచ్చి పెట్టే షో.. కనకనే ఎప్పుడెప్పుడు మొదలెడదామా అని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తుంది. కానీ కరోనా రోజు రోజుకి పెరిగిపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

అదేమిటంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికీ కరోనా టెస్ట్ నిర్వహించి.. నెగెటివ్ అని తేలితే.. వెంటనే హౌస్ లోకి పంపకుండా ఓ రెండు వారాల పాటు వాళ్ళని నిర్వాహకుల పర్యవేక్షణలో ఉంచి, మళ్ళీ కరోనా టెస్టులు చేసి.. కంటెస్టెంట్స్ ఎవరికీ పాజిటివ్ లేదని నిర్ధారించుకున్న తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారని సమాచారం అందుతుంది. అలాగే బిగ్ బాస్ కోసం పనిచేసే ప్రతి టెక్నీషియన్ కి కరోనా టెస్ట్ నిర్వహిస్తారని చెబుతున్నారు. మరి ఈ ప్రాసెస్ ఇప్పుడు మొదలైతేనే కానీ.. లేదంటే ఇదంతా మొదలుపెట్టి.. మొత్తం తతంగం పూర్తయ్యి.. షో స్టార్ట్ అవ్వాలంటే ఏ సెప్టెంబర్ లేదా అక్టోబర్ అయినా అవ్వొచ్చు.

Bigg Boss 4 Latest Update :

New Rules in Bigg Boss 4 contesiitnts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ