రాజమౌళి హైదరాబాద్ ని వదిలేసి తన ఫామ్ హౌస్ కి మకాం మార్చడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ లో కరోనా కేసులు భీభత్సంగా పెరగడం, RRR షూటింగ్ కి ఇంకా టైం పడుతుంది అని రాజమౌళి ప్రస్తుతం ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడని సోషల్ మీడియా కథనం. అయితే రాజమౌళి ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్నాడా? లేదా మరేదైనా సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడా? అనే మీమాంసలో ప్రేక్షకులు ఉన్నారు. రాజమౌళి ఫామ్ హౌస్ వంద ఎకరాల మధ్యలో కట్టినది. దాని చుట్టూ రకరకాల పంటలు పండే చేను అది. అయితే ప్రస్తుతం షూటింగ్ లేక రాజమౌళికి ఇష్టమైన వ్యవసాయ పనులు కోసం ఫామ్ హౌస్ కి మారేడేమో అంటుంటే.. కాదు రాజమౌళి, మహేష్ కోసం కథ రెడీ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. రాజమౌళి RRR తరవాత మహేష్ తో మూవీ చేస్తున్నట్టు చెప్పడంతో.. ప్రస్తుతం RRR వర్క్ ఆగడంతో.. మహేష్ కోసం స్క్రిప్ట్ పనులను మొదలెట్టాడేమో అనుకుంటున్నారు.
అయితే మరోవైపు.. RRR షూటింగ్ అయితే ఆగింది కానీ.. తెర వెనుక చేయాల్సిన పనులన్నీ రాజమౌళి ఫామ్ హౌస్ లో కొనసాగిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం RRR యానిమేషన్ పార్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారని.. కథలో కొన్ని సన్నివేశాల్ని యానిమేషన్ రూపంలో రాజమౌళి తెర మీద చూపించబోతున్నారట. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు నేపథ్యాలను యానిమేషన్ లో రాజమౌళి ప్రేక్షకులకు వివరిస్తాడట. అలాగే సినిమా క్లైమాక్స్ లోను కొమరం భీం, అల్లూరిపాత్రలు స్వాతంత్య్ర పోరాటం ఎలా చేశారు.. అందులో ఎవరి పాత్ర ఎంత అనేది కూడా ఈ యానిమేషన్ ద్వారానే వివరిస్తాడట రాజమౌళి. ఇక సినిమాకి కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ కూడా కరోనా మొదలవ్వగానే ఆయా సన్నివేశాల్ని గ్రాఫిక్స్ స్టూడియోలకు పంపెయ్యడం చూస్తుంటే.. రాజమౌళి ఫామ్ హౌస్ లోను RRR పనులతోనే బిజీగా ఉన్నాడనే అనిపిస్తుంది.