బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. సాహో సినిమాతో అది ప్రూవ్ చేసుకున్నాడు కూడా. అయితే ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో 2021లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమా పూర్తి ప్రేమకథా చిత్రమని తెలిసిందే. యూరప్ ప్రాంత నేపథ్యంలో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా అనంతరం ప్రభాస్, మహనటి దర్శకుడ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న సినిమాపై సొషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరక్కుతోందని దర్శకుడే అనౌన్స్ చేసాడు. అయితే అప్పటి నుండి ఇది టైమ్ ట్రావెలర్ కథాంశం కానుందనీ, ప్రభాస్ దేవకన్య కొడుగ్గా కనిపించనున్నాడని అన్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా నటీనటులని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడట.
తాజాగా ఈ సినిమాపై మాటల రచయిత చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైలాగ్ రైటర్ గా కొనసాగుతున్న సాయి మాధవ్ బుర్రా, ఈ సినిమాది పాన్ వరల్డ్ రేంజ్ అంటున్నాడు. ఇదే మాటని గతంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా అన్నాడు. పాన్ ఇండియా అంటేనే సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక పాన్ వరల్డ్ అంటే హాలీవుడ్ చిత్రాలతో పోటీపడేలా ఉంటుందేమోనని భావిస్తున్నారు. అదీగాక ఈ సినిమాని భారతీయ భాషల్లోనే గాక విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అందుకే పాన్ వరల్డ్ మాట వినిపిస్తోందని అంటున్నారు.