Advertisementt

క్రిష్ణ అండ్ హిస్ లీల హీరో కథ రాస్తున్నాడు..!

Fri 17th Jul 2020 12:25 PM
siddu jonnalagadda,ravikanth perepu,narudi bratuku natana,krishna and his leela  క్రిష్ణ అండ్ హిస్ లీల హీరో కథ రాస్తున్నాడు..!
Siddu Jonnalagadda penning for his next..? క్రిష్ణ అండ్ హిస్ లీల హీరో కథ రాస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

ఇటీవల ఓటీటీలో విడుదలయిన తెలుగు సినిమాల్లో ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న చిత్రాల్లో క్రిష్ణ అండ్ హిస్ లీల కూడా ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాని రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించారు. క్షణం వంటి సస్పెన్స్ థ్రిల్లర్ ని తెరకెక్కించిన రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

ఇద్దరు అమ్మాయిలని ఒకేసారి ఒకే విధంగా ఒకే ఎమోషన్ తో ప్రేమించే అబ్బాయి మదిలో కలిగే కన్ఫ్యూజన్ ని చాలా చక్కగా చూపించిన చిత్రమిది. ఈ సినిమాతో హీరోగా సిద్ధు జొన్నలగడ్డకి మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమాకి సిద్దు కేవలం హీరో మాత్రమే కాదు. రచయిత కూడా.. కథ, స్క్రీన్ ప్లే, సంభాషణల్లో సిద్ధు పాత్ర చాలా ఉందట. ఈ మేరకు టైటిల్ కార్డ్ కూడా వేసారు. అయితే సిద్ధు తన తర్వాతి చిత్రానికి కూడా కథ అందిస్తున్నాడట.

నరుడి బ్రతుకు నటన అనే టైటిల్ తో సిద్ధు రాసిన కథని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించనుందట. ఈ సినిమాలో సిద్దు హీరోగా నటించనున్నాడు. నూతన దర్శకుడికి ఈ సినిమా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట. మొత్తానికి హీరో సిద్ధు కోసం కథలు రాయాల్సిన అవసరమే లేదన్నమాట..!

Siddu Jonnalagadda penning for his next..?:

Siddu Jonnalagadda penning for his next..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ