రాజమౌళి.. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో RRR ప్రకటించినప్పటినుండి రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఇద్దరూ ఏ హీరోకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.. ఏ హీరో హీరోయిజాన్ని రాజమౌళి ఎక్కువ చూపిస్తాడో? అసలు రాజమౌళి ఇద్దరి హీరోలను ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఇచ్చాడా? ఇద్దరి స్టార్ హీరోల అభిమానులతో రాజమౌళి పెట్టుకుంటున్నాడు? అంటూ చాలారకాల న్యూస్ లు సోషల్ మీడియాలో వినిపించాయి. మరి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే అలాగే ఉంటుంది. రాజమౌళి ఎక్కడ ఏ హీరోని తక్కువ చేసినా అభిమానుల దగ్గర బుక్ అవడం ఖాయం. అలాంటిది ఇద్దరి హీరోలతో సినిమా చేస్తున్నాడంటే రాజమౌళి ఎంత గ్రౌండ్ వర్క్ చెయ్యాలి. జస్ట్ రామ్ చరణ్ పుట్టిన రోజునాడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ స్పెషల్ వీడియో వదిలి.... కరోనా కారణంగా ఎన్టీఆర్ పుట్టిన రోజుకి కొమరం భీం వీడియో వదలనందుకే రాజమౌళికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చుక్కలు చూపించారు.
అలాంటిది కేరెక్టర్స్‌లో ఎక్కువ తక్కువలు, యాక్షన్ లో తగులు మిగుళ్లు ఉంటే ఎలా ఊరుకుంటారు. అయితే ఇప్పుడు RRR మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ అభిమానుల అనుమానాలను పటాపంచల్ చేసేసాడు. తాజాగా బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ... రౌద్రం రణం రుధిరం సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సమానమైన ప్రాముఖ్యత ఉందని... అందులో ఎలాంటి సందేహం లేదని... ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాత్రల మధ్యన అంతలా రాజమౌళి బ్యాలెన్స్ చేశాడని చెప్పడమే కాదు... తాను సైతం ఇద్దరికీ సమానంగా డైలాగులు రాశానని అంటున్నాడు. ఇక కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రల నిడివి కూడా సమానంగానే ఉంటుందని, ఈ విషయంలో అభిమానులకు ఎటువంటి అనుమానాలూ అక్కర్లేదని క్లారిటీ ఇవ్వడంతో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.