Advertisementt

బాలీవుడ్‌లో బన్నీ రేంజ్ మాములుగా లేదు!

Sat 18th Jul 2020 03:35 PM
allu arjun,craze,bollywood,viral  బాలీవుడ్‌లో బన్నీ రేంజ్ మాములుగా లేదు!
Superb Craze to Allu Arjun in Bollywood బాలీవుడ్‌లో బన్నీ రేంజ్ మాములుగా లేదు!
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్స్‌గా మారిన హీరోలు బాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ లేకుండానే వెళ్లారు. ప్రభాస్ బాహుబలి విడుదలకు ముందు ఎలాంటి క్రేజ్ లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ఉంది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ల క్రేజ్ అంతంతమాత్రమే. రామ్ చరణ్ అయినా జంజీర్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచయం ఉంది కానీ.. ఎన్టీఆర్‌కి ఎలాంటి పరిచయం లేదు. ఇప్పుడు వాళ్ళు RRR తో పాన్ ఇండియా స్టార్స్ గా మారుతున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో బాలీవుడ్‌కి అడుగుపెడుతున్నారు. పుష్ప తోనే అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియాకి మారలేదు. అల్లు అర్జున్‌పై ఇప్పటికే బాలీవుడ్ అభిమానులు, హీరోలు ప్రేమని అభిమానాన్ని కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాలు బాలీవుడ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంటాయి.

తాజాగా సరైనోడు సినిమా హిందీ యూట్యూబ్ లో సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్స్ కి బాలీవుడ్ స్టార్స్ ఫిదా అయ్యి టిక్ టాక్స్ కూడా చేసారు. ఇక అల్లు అర్జున్ డాన్స్ కి బాలీవుడ్ స్టార్ హీరోలే ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ అంటే బాలీవుడ్ స్టార్స్‌కి ఎందుకంత ఇష్టం అనేది యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ ఒక్కముక్కలో తేల్చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వెలువడిన ఓ ఆర్టికల్ కి సమాధానంగా విద్యుత్ జమాల్ అల్లు అర్జున్ అంటే ఓ అద్భుతం అంటూ ఒకే ఒక్కమాటలో అల్లు అర్జున్ క్రేజ్‌కి సమాధానం చెప్పాడు. రెండు రోజుల క్రితం ప్రముఖ డైరెక్టర్ సంజయ్ గుప్తా అల వైకుంఠపురములో మూవీ ఈమధ్యనే చూసా అని.. సినిమా అద్భుతం అని, బన్నీ ఒక్క ఛాన్స్ ఇస్తే మూవీ చేస్తాను అంటూ చెప్పడంతో బన్నీ క్రేజ్ బాలీవుడ్ లో ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తుంది. అంటే పుష్పతో బాలీవుడ్‌కి బన్నీ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చినట్టే అన్నమాట. 

Superb Craze to Allu Arjun in Bollywood:

Allu Arjun Craze in Bollywood goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ