Advertisementt

నాగబాబూ.. కామెడీ కాకపోతే ఏంటిది?

Sat 18th Jul 2020 02:55 PM
nagababu,comedy shows,comedy,social media,plans  నాగబాబూ.. కామెడీ కాకపోతే ఏంటిది?
Nagababu plans Comedy Shows in His Youtube Channel నాగబాబూ.. కామెడీ కాకపోతే ఏంటిది?
Advertisement
Ads by CJ

నాగబాబు ప్రస్తుతం ఏం చేయాలో తెలియక.. కామెడీ షోస్ అంటూ కామెడీ చేస్తున్నాడు. జబర్దస్త్‌లో కామెడీ షోకి జడ్జిగా ఉన్నప్పుడు నాగబాబు అంటే చాలామందికి రెస్పెక్ట్ ఉండేది. అయితే నాగబాబు జబర్దస్త్ ని వదిలేసి జీ ఛానల్ అదిరింది షో కి వెళ్ళాక నిజంగానే నాగబాబు కామెడీ అయ్యాడు. అదిరింది షోని లేపడానికి ఎంత ట్రై చేసినా నాగబాబు వల్ల కావడం లేదు. దాదాపుగా అదిరింది షో డిజాస్టర్‌గా మిగిలిపోయి.. దుకాణం సర్దేస్తుందేమో అనే ఫీలింగ్ వచ్చేలోగా... నాగబాబు ఇప్పుడు తన ఓన్ యూట్యూబ్ ఛానల్‌లో రెండు కామెడీ షోస్ ప్లాన్ చేసాడు. అయితే నాగబాబు జబర్దస్త్‌లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ జనసేన కార్యక్రమాలలో కనిపించేవాడు. అప్పుడప్పుడు జనసేనపై మాట్లాడుతుండేవాడు. రోజా జబర్దస్త్ జడ్జ్ అయినప్పటికీ.. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రతో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ నాగబాబు వల్ల మాత్రం అది అవ్వడం లేదు.

అయితే ఇప్పుడు జనసేన ఒక్క పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకెళ్లడం అంటే అయ్యే పనిలా లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎవరికీ ఛాన్స్ ఇవ్వడు. అలాగని జనసైనికులు జనసేనానిని వదల్లేరు. మరోపక్క పవన్ జనసేనకు మీడియా మద్దతు లేదు. పవన్ ఏం మాట్లాడినా ప్రభుత్వ అనుకూల మీడియా, ప్రతిపక్ష అనుకూల మీడియాలు ప్రచారంలోకి రానివ్వవు. మరోపక్క పవన్ కళ్యాణ్ జనసేనానిగా ప్రజలు మర్చిపోతారేమో అనే ఫీలింగ్ జనసేనలోనే కలుగుతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కి నాగబాబు వెన్నంటి ఉంటే బావుంటుంది. కానీ అదిరింది షోలో జడ్జ్‌గా చేసినా ప్రాబ్లమ్ లేదు. కానీ ఇలా కామెడి షోస్ ప్లాన్ చేసి.. వాళ్ళని ఒకతాటిపైకి తెచ్చి.. ఆ షో ని హ్యాండిల్ చెయ్యాలంటే కష్టం. ఇక జనసేనాని ఏం పట్టించుకుంటావ్ నాగబాబు అంటున్నారు జనసైనికులు. వాళ్ళన్నది కరెక్ట్. కాకపోతే నాగబాబుకి కూడా జనసేన మీద బోర్ అయినా కొట్టుండాలి. లేదంటే డబ్బు సంపాదన కోసమే అయినా అయ్యుండాలి.

Nagababu plans Comedy Shows in His Youtube Channel:

Nagababu Comedy shows goes Comedy in SM

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ