Advertisementt

జబర్ధస్త్‌ని బీట్ చేసి షాకిచ్చిన న్యూస్..!

Sat 18th Jul 2020 12:48 PM
jabardasth,etv news,shock,beats  జబర్ధస్త్‌ని బీట్ చేసి షాకిచ్చిన న్యూస్..!
ETV news beats ETV Jabardasth Show జబర్ధస్త్‌ని బీట్ చేసి షాకిచ్చిన న్యూస్..!
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోని ఏ ఛానల్ షో అయినా చెక్ పెట్టలేకపోయింది. జబర్దస్త్ షో ఎక్స్ట్రా జబర్దస్ షో ఎప్పుడు టాప్‌లోనే ఉండేది. కరోనా లాక్‌డౌన్‌లోనూ పాత స్కిట్స్‌తోనే ఈటీవీ యాజమాన్యం మేనేజ్ చేసింది. కామెడీ షో కనక మళ్ళీ మళ్ళీ చూస్తారు. లాక్‌డౌన్ తర్వాత కూడా కొత్త ఉత్సాహంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లు రెండూ మళ్ళీ టాప్ ప్లేస్ లోకి వచ్చేశాయి. హైపర్ ఆది పంచెస్, సుడిగాలి సుధీర్ లవ్ పాటలు, కొత్తగా తాగుబోతు రమేష్, మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన షకలక శంకర్ అందరూ కొత్త కొత్తగా కామెడీ చేస్తూ జబర్దస్త్ స్టేజ్‌ని అల్లాడిస్తున్నారు.

అయితే ఇప్పుడు అలాంటి ఈటీవీ జబర్దస్త్‌ని ఈటీవీనే చెక్ పెట్టిన విషయం ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తున్న న్యూస్. ఎలా అంటే ఈటీవీ న్యూస్‌తో ఈటీవీ జబర్దస్త్ షో రేటింగ్ కంపేర్ చేస్తే.. ఈటీవీ న్యూస్ టీఆర్పీ రేటింగ్ జబర్దస్త్ రేటింగ్ కన్నా ఎక్కువ ఉందట. తాజాగా బార్క్ ప్రకటించిన రేటింగ్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షో కు గట్టి షాక్ ఇచ్చింది ఈటీవీ న్యూస్. మరి ఎప్పుడో ఉదయం 7 గంటలకొకసారి, అలాగే రాత్రి 9 గంటలకొకసారి ప్రసారమయ్యే ఈటీవీ న్యూస్ జబర్దస్త్ ని క్రాస్ చెయ్యడం కాస్త విడ్డూరమే. ఎందుకంటే ఇప్పుడు ఏ టైమ్‌లో అయినా లైవ్ అప్‌డేట్స్ తో టీవీ9, ఎన్టీవీ, ఏబీఎన్ ఇలాంటి ఛానల్స్ వేసిన న్యూస్ వేసి చికాకు పెడుతున్నాయి. అలాంటిది ఈటీవీలో న్యూస్ చూసే వాళ్ళు ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది కదూ... మరి వినడానికి విడ్డూరంగా ఉన్నా ప్రస్తుత కరోనా పరిస్థితుల వలన ఈటీవీ న్యూస్ కి బాగా ప్రాధాన్యత పెరిగింది అని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.

ETV news beats ETV Jabardasth Show:

Shock to Jabardasth with ETV News

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ