Advertisement
TDP Ads

జీవా ‘జిప్సి’ ఆహా ఓటీటీలో..!

Fri 17th Jul 2020 08:34 AM
hero jeeva,gypsy movie,natasha singh,release,july 17,ott  జీవా ‘జిప్సి’ ఆహా ఓటీటీలో..!
Jeeva gypsy Movie Ready to Release in OTT Aha జీవా ‘జిప్సి’ ఆహా ఓటీటీలో..!
Advertisement

‘జిప్సి’ తెలుగు ప్రేక్షకులను జూలై 17న ఆహా ఓటీటీ ద్వారా పలకరించనున్న‘రంగం’ ఫేమ్ జీవా 

‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో అంబేద్ కుమార్ నిర్మించిన చిత్రం ‘జిప్సి’. జూలై 17న తెలుగు ఓటీటీ ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను జిప్సి పలకరించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో...

జీవా మాట్లాడుతూ... ‘‘‘జిప్సి’చిత్రంలో హీరో ఈ ప్రపంచాన్ని తన ఇల్లుగా భావించే క్యారెక్టర్. అది కాకుండా జిప్సీ పాత్ర దేశమంతటా సంచరించే యువకుడిని బేస్ చేసుకుని సినిమాను తెరకెక్కించాం. అందుకని ఓ ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని సినిమా చేయలేదు. ఇదొక యూనిట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. హీరో పాత్రకు ఓ భాషను పెట్టామంతే. ఇలాంటి ఓ పాయింట్‌ను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకంతోనే తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నాం. నాకు తెలిసి సినిమాకు హద్దులు లేవు. ప్రస్తుత పరిస్థితులు ప్రేక్షకులు అన్నీ రకాల సినిమాలను, వెబ్ సిరీస్‌లను చూస్తున్నారు. నేను కూడా అలాగే విదేశీ భాషలు, తెలుగు సినిమాలను చూశాను. ఓ నటుడిగా అన్నీరకాల సినిమాలను చేయాలనే భావిస్తాను. అందుకనే ఓ ఫార్మేట్‌ సినిమాలను చేయకుండా డిఫరెంట్ మూవీస్ చేశాను. నేను బాలీవుడ్‌లో నటించిన ‘83’ సినిమా కూడా యూనివర్సల్ మూవీ. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సినిమాలను భాషా బేదంతో చూడకూడదు. అందులో నటించేటప్పుడు కూడా భాషతో మనకు అవసరం ఉండదు. యాక్టర్‌గా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు చేయాలనే అనుకుంటాను. నిర్మాత తనయుడిగా చాలా రకాల కథలను వింటూ ఉంటాను. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు లైఫ్ టైమ్ క్యారెక్టర్ జిప్సీకి ప్రపంచమే ఇల్లు.. హీరోయిన్ నటాషాకు ఇల్లే ప్రపంచం. ఇద్దరు వేర్వేరు మనస్తత్వాల వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేదే ఈ సినిమా’’ అన్నారు. 

చిత్ర దర్శకుడు రాజు మురుగన్ మాట్లాడుతూ... ‘‘నేను జర్నలిస్ట్. నేను ట్రావెల్‌ను బాగా ఇష్టపడతాను. చాలా ప్రాంతాలకు ట్రావెల్ చేశాను. ఆ క్రమంలో నేను జిప్పి తరహా పాత్రలను చూశాను. నేను చూసిన క్యారెక్టర్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథను తయారు చేసుకున్నాను. అలాగే మన సమాజంలో సమానత్వం, యూనిటీ లేదు. అందువల్లనే ఘర్షణలు జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి ఓ పాయింట్‌ను ప్రధానాంశంగా ఈ సినిమాలో యాడ్ చేశాను. ఇలాంటి సినిమాలను తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే సినిమా అనేది కళ. దాని ద్వారా మనం ఏదైనా విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు దానికి కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దుల్లోనే చెబితే అది బావుంటుంది. దాన్ని దాటితేనే సమస్యలు వస్తాయి. జిప్పి తప్పకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందనే నమ్మం ఉంది’’ అన్నారు. 

హీరోయిన్ నటాషా సింగ్ మాట్లాడుతూ... ‘‘రాజుగారు నన్ను చెన్నై గారికి ఇంటర్వ్యూకి పిలిచారు. సెలక్ట్ చేసిన తర్వాత జీవాగారు హీరోగారు అని చెప్పగానే హ్యాపీగా అనిపించింది. సినిమా అంతా నా చుట్టూనే తిరుగుతుంది. 

అసలు నా పాత్ర జిప్సి పాత్రకు ఎలా కనెక్ట్ అవుతుంది. తర్వాత ఏమౌతుందనే అంశాలను, ప్రస్తుత రాజకీయాలకు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు లింక్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.

Jeeva gypsy Movie Ready to Release in OTT Aha:

Jeeva gypsy Movie Release on July 17th in OTT

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement