Advertisementt

సమంత ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక!

Fri 17th Jul 2020 08:20 AM
rashmika mandanna,green india challenge,raashi khanna,kalyani priyadarshan,samantha  సమంత ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక!
Rashmika Mandanna Participates Green India Challenge సమంత ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక!
Advertisement
Ads by CJ

అక్కినేని సమంత ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరోయిన్ రష్మిక మందన్నా

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన హీరోయిన్ రష్మిక మందన్నా ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలియజేయడం జరిగింది.

ఈ ఛాలెంజ్‌లోకి నన్ను ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు అని తెలిపిన రష్మిక.. ఈ సందర్భంగా తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. హీరోయిన్లు అయిన రాశి ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్‌లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు.

Rashmika Mandanna Participates Green India Challenge:

Rashmika Mandanna Challenge to Raashi Khanna and Kalyani Priyadarshan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ