కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎన్ని ఇబ్బందులు పడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లు మూతబడి, షూటింగులు లేక, ఆర్థికంగా చితికిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే రోజు రోజుకీ కరోనా పెరిగిపోతున్న నేపథ్యంలో మహమ్మారిపై అవగాహన పెంచేందుకు సినిమా సెలెబ్రిటీలు బాగానే కృషి చేస్తున్నారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక అడుగు ముందున్నారనే చెప్పాలి.
కరోనా మహమ్మారి హైదరాబాద్ ని తాకినపుడు, అందరి కంటే ముందుగా షూటింగుని ఆపివేసి చిత్రబృందంలో ఎవ్వరూ ఇబ్బంది పడకుండా, పరిశ్రమలో ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు. అంతే కాదు కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన జాగ్రత్తలని చెబుతూ వీడియోతో మన ముందుకు వచ్చారు. ప్రభుత్వంతో పాటు పేరుమోసిన సెలెబ్రిటీలు కరోనా గురించి అవగాహన కల్పిస్తూనే ఉన్నా కూడా కొందరు మాస్కులని ధరించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
అలాంటి వారికి కూడా అర్థమయ్యేలా వీడియోని రిలీజ్ చేసాడు. ఈ వీడియోలో బయటకి వెళ్లడానికి రెడీ అవుతున్న ఈషారెబ్బాని మాస్కు పెట్టుకొమ్మని సున్నితంగా హెచ్చరిస్తాడు. కరోనాపై పోరులో మాస్కు తప్పనిసరి అని గుర్తుచేస్తున్న ఈ వీడియో వైరల్ గా మారింది.