Advertisementt

‘ఇన్‌స్టా‌గ్రమ్’: విజయ్ అకౌంట్‌లో రికార్డ్!

Fri 17th Jul 2020 08:17 AM
vijay deverakonda,first south indian actor,achieve,instagram,rowdy star  ‘ఇన్‌స్టా‌గ్రమ్’: విజయ్ అకౌంట్‌లో రికార్డ్!
Vijay Deverakonda First South Indian Actor to achieve this mark ‘ఇన్‌స్టా‌గ్రమ్’: విజయ్ అకౌంట్‌లో రికార్డ్!
Advertisement
Ads by CJ

సౌత్‌లోనే నెం.1 హీరో‌గా విజయ్ దేవరకొండ, ‘ఇన్‌స్టా‌గ్రమ్’లో 8 మిలియన్ ఫాలోయర్స్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్ర్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విజయ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఇన్‌స్టా‌గ్రమ్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 8 మిలియన్ల ఫాలోయర్స్‌ను సంపాదించుకొని సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హీరోగా నిలిచాడు.

 

80 లక్షల మార్కు దాటటంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విజయ్‌కు ఇంత మంది ఫాలోయర్స్ ఉండటానికి రీజన్ ఆయనను దేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే. విజయ్ నటించిన తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ హిందీలో డబ్ కావడంతో అక్కడ కూడా ఫ్యాన్స్ అయ్యారు. ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో విజయ్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో డైరెక్ట్ గా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ.

Vijay Deverakonda First South Indian Actor to achieve this mark:

Vijay Deverakonda becomes No.1 South Hero to Cross 8 Million followers on Insta

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ