Advertisementt

వెబ్‌సైట్‌లో షకీలా ‘లేడీస్ నాట్ అలౌడ్’ రిలీజ్!

Fri 17th Jul 2020 08:12 AM
ladies not allowed movie,release details,website,shakeela,sairam dasari  వెబ్‌సైట్‌లో షకీలా ‘లేడీస్ నాట్ అలౌడ్’ రిలీజ్!
Ladies not allowed movie Release details వెబ్‌సైట్‌లో షకీలా ‘లేడీస్ నాట్ అలౌడ్’ రిలీజ్!
Advertisement
Ads by CJ

నటి షకీలా సమర్పణలో సాయిరామ్‌ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్‌ నాట్‌ అలౌడ్‌’. రమేష్‌ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్‌ రెడ్డి సహ నిర్మాత. ఇదొక పూర్తిస్థాయి కామెడీ చిత్రం. దర్శకుడు సాయి రామ్ దాసరి తెరకెక్కించిన అడల్ట్ కామెడీ హారర్ సినిమా. సెన్సార్ వివాదంతో గడిచిన సంవత్సర కాలంగా థియేటర్ రిలీజ్‌కి నోచుకోలేని ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఆన్‌లైన్ లో విడుదల కానుంది. జులై 20న లేడీస్ నాట్ అలౌడ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ లో చిత్రం విడుదల కానుంది. సినిమా చూసేందుకు 50 రూపాయలు చెలించాల్సి ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. వివరాలలోకి వెళితే..

తొలి ప్రైవేట్ పాటతోనే కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు తెచ్చుకొని.. తొలి సినిమా నుండి తీసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వివాదంలో సృష్టిస్తూ.. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారిన సాయిరామ్ దాసరి గత సంవత్సరం ప్రముఖ నటి షకీలా సమర్పణలో లేడీస్ నాట్ అలౌడ్ అనే సినిమాను తెరకెక్కించారు. కానీ.. సెన్సార్ ఆ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ వివాదాన్ని ఆయన ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. కరోనా కారణంగా ఆ వివాద పరిష్కారం ఇప్పటికి ముగియలేదు. మరో పక్క సినిమా హాల్స్ తెరుచుకొని ఇప్పటికే 100రోజులు పైన గడిచింది. ఇప్పట్లో సినిమా హాల్స్ తెరుచుకునే అవకాశం కూడా లేకపోవడంతో సినిమాను నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుంది.

ఇప్పటికే అందరూ ఓ.టి.టి లలో సినిమాను విడుదల చేస్తుంటే.. రొటీన్‌గా చేస్తే ఏముంది అనుకున్నారో ఏమోగానీ తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక వెబ్సైట్ చేసి నేరుగా అందులో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సినిమా చూసేందుకు ప్రేక్షకులు 50 రూపాయలు చెలించాల్సి ఉంటుంది. ఈ సినిమాను జులై 20న రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు సాయిరామ్ దాసరి తెలిపారు. ఈ వారం సినిమా ప్రోమోషన్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు షకీలా తెలిపారు. ఈ సినిమాను కావాలి రమేష్, విక్రాంత్ రెడ్డి, షకీలా సంయుక్తంగా నిర్మించారు. శ్రీ మిత్ర సంగీతం అందించగా..తరుణ్ కరంథోద్ సినిమాటోగ్రపీ చేశారు. కె.ఆర్.స్వామి ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరించారు.

Ladies not allowed movie Release details:

Ladies not allowed movie Release in website 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ