Advertisementt

తమిళ హీరో విజయ్.. డేరింగ్ స్టెప్..!

Fri 17th Jul 2020 08:07 AM
tamil star hero,vijay,remuneration,cutting,kollywood,vijay hero  తమిళ హీరో విజయ్.. డేరింగ్ స్టెప్..!
Kollywood: Star Hero Vijay Takes Daring Step తమిళ హీరో విజయ్.. డేరింగ్ స్టెప్..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎవరికీ ఆశాజనకంగా లేవు. ఒక్క సినిమా పరిశ్రమ అనే కాదు.... అనేక ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కంపెనీలే కరోనాకి దణ్ణం పెట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమ మళ్ళీ ఓ కొలిక్కి రావాలంటే సినిమా బడ్జెట్ కంట్రోల్ లాగే హీరో హీరోయిన్స్ పారితోషకాలు తగ్గింపు ప్రక్రియ అనేది చాలా అవసరమని రాజమౌళి లాంటి డైరెక్టర్ చెప్పారు. అయితే ఇప్పటివరకు పారితోషకాలు తగ్గింపు విషయంలో ఏ ఒక్క హీరో కానీ హీరోయిన్ కానీ ముందుకు రాలేదు. అలాగే తమిళ, హిందీ ఏ భాష హీరోలు పారితోషకాల విషయంలో వెనక్కి తగ్గినట్టుగా న్యూస్ లేదు.

అయితే తాజాగా తమిళ హీరో విజయ్ తన పారితోషకాన్ని తగ్గించుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి. విజయ్ తన పారితోషకంలో ఓ 20 శాతం తగ్గిస్తున్నట్లుగా నిర్మాతలకు చెప్పినట్టుగా సోషల్ ఇండియా టాక్. మాములుగా స్టార్ హీరో విజయ్ పారితోషికం అతి భారీ కనుక నిర్మాతకు ఇది చాలా పెద్ద ఉపశమనమే అంటున్నారు. అయితే 20 శాతం సరిపోతుందా లేదా ఇంకా తగ్గించాలి అనేది ముందు ముందు ఆలోచిస్తానని నిర్మాతలకు విజయ్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే విజయ్.. ఏ ఆర్ మురుగదాస్ తో చేయనున్న మూవీ పారితోషికంలో 20శాతం తగ్గించుకున్నట్లుగా టాక్. మరి విజయ్ చేసిన పని చూసి హీరోలంతా బుద్ది తెచ్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ న్యూస్ మన హీరోల వరకు చేరిందో లేదో చూడాలి.

Kollywood: Star Hero Vijay Takes Daring Step:

Tamil Star Hero Vijay cuts his Remuneration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ