హీరోయిన్‌గా గ్యాప్ తీసుకుని మళ్ళీ మూడు సినిమాలతో ఒకేసారి బిజీ అయిన శృతి హాసన్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే తిష్ట వేసింది. కరోనా లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ మొదలవుతున్నాయ్ అనగానే హైదరాబాదులో వాలిపోయిన శృతి హాసన్ లాక్ డౌన్ లో సంగీతంపై మరింత పట్టు సాధించేందుకు బాగా వర్కౌట్స్ చేసినట్లుగా చెబుతుంది. అలాగే వంట నేర్చుకోవడం, అలాగే తన పనులు తానే స్వయంగా చేసుకోవడం వంటి విషయాలతో లాక్ డౌన్ ని బోర్ కొట్టకుండా గడిపేసిందట. ఇక రవితేజ క్రాక్ సినిమాలోనూ, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో నటిస్తున్న శృతి హాసన్ కి డ్రీం రోల్స్ లాంటివి ఏమి లేవట. కానీ బలమైన కథ దొరికితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చెయ్యడానికి కూడా సిద్దమే అని చెబుతుంది. అయితే ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని, అందుకే కొత్త కథలను వినడం లేదని చెబుతుంది శృతి హాసన్.
ఇక సంగీతం అంటే చాలా ఇష్టమని, ఒక సినిమాకి పూర్తి స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ గా చెయ్యాలంటే చాలా కష్టమని, అయితే తాను నటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెబుతుంది. అలాగే ఓన్ గా ప్లే బ్యాక్ సింగర్‌లా చేస్తా అని.. మ్యూజిక్ కోసం లండన్ వెళ్లాల్సి ఉంటుంది. నేను మ్యూజిక్‌ని, సినిమాని రెండింటిని విపరీతంగా ఎంజాయ్ చేస్తా అని చెబుతుంది శృతి హాసన్. ఇక పారితోషకం విషయాలు మాట్లాడడం అంతగా నాకు నచ్చదు. నాతో పాటు సినిమా సెట్స్ లో ఎందరో పనిచేస్తుంటారు. అందరూ తమ వంతు కష్టపడుతుంటారు. ఇక నాకు దర్శకత్వం చేసే ఆలోచనలు లేవు. దర్శకత్వం అంటే చాలా పెద్ద ఆలోచన, అంతేకాదు చాలా కష్టం, పెద్ద బాధ్యత లాంటిది అందుకే ప్రస్తుతానికి దానిగురించి ఆలోచించడం లేదని చెబుతుంది శృతి హాసన్.