చిరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న ఆచార్య సినిమా విషయాలు చాలావరకు మీడియాకి చెప్పేసారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీ రోల్ లో నటించబోతున్నాడని. అలాగే ఈ సినిమాలో చిరు చాలా ఎనర్జీగా కనిపించనున్నాడని.. హీరోయిన్ గా త్రిష తప్పుకోగా.. కాజల్ అగర్వాల్ ని తీసుకున్నట్లుగా కొరటాల చెప్పాడు. అలాగే కరోనా లాక్ డౌన్ లో గనక ఆచార్య సినిమా వాయిదా పడకపోతే ఈపాటికి షూటింగ్ చివరి దశలో ఉండేది. అయితే తాజాగా ఈ సినిమాలో నాలుగైదు సాంగ్స్ ఉన్నాయని.. అందులో ఓ ఐటెం సాంగ్ ఉందని ఈ సినిమా మ్యూజిక్ దర్శకుడు మణిశర్మ చెప్పాడు. అయితే చిరు ఆచార్యలో ఓ ఐటెం సాంగ్ ఉందని... షూటింగ్ మొదలు పెట్టడమే ఈ సినిమా ఐటెంసాంగ్‌తో మొదలయ్యింది అని .. ఈ సాంగ్ లో హీరోయిన్ రెజినా ఆడిపాడినట్లుగా చెప్పడమే కాదు.. రెజినా కూడా చిరుతో ఐటెం సాంగ్ చేసినట్లుగా చెప్పింది. అలాగే చిరు మంచి డాన్సర్ అని తెగ పొగిడేసింది.
కానీ తాజాగా చిరు ఆచార్యలో ఐటెం సాంగ్ కోసం ఐటెం స్పెషలిస్ట్ గా మారిన తమన్నాని మూవీ టీం సంప్రదించినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తమన్నా ఫోటో పెట్టి చిరు ఆచార్య ఐటెం సాంగ్ కోసం తమన్నా రాబోతుంది, భారీ పారితోషకానికి తమన్నా స్పెషల్ సాంగ్ చెయ్యబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి గతంలోనే రెజినా ఆచార్యలో ఐటెం సాంగ్ చేసినట్లుగా చెప్పింది. అంటే ఇప్పుడు తమన్నాతో మరో ఐటెం ప్లాన్ చేసారా? లేదంటే రెజీనాని తీసేసి మళ్లీ ఐటెంని మార్చబోతున్నారా? అనేది ఇప్పుడు మెగా ఫాన్స్ ముందున్న కన్ఫ్యూజన్. మరి ఆచార్య ఐటెం పై వస్తున్న ఈ న్యూస్ పై ఆచార్య టీం ఏమన్నా స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.