కరోనా టైమ్ లో ఇండియాలోకెల్లా.. ఆ మాటకొస్తే ప్రపంచంలోకెల్లా బిజీగా ఉన్న సినిమా దర్శకుల జాబితాలో రామ్ గోపాల్ వర్మ పేరు ఒక్కటే ఉంటుందేమో. కరోనా కారణంగా సినిమా షూటింగులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ ఒక్కడే సినిమాలని తెరకెక్కిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఏటీటీ అనే కొత్త ఫ్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసి పే పర్ వ్యూ పద్దతిలో డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ఇప్పటి వరకు ఈ పద్దతి ద్వారా రెండు సినిమాలని రిలీజ్ చేసి బాగానే ఆర్జించినట్లు సమాచారం. అయితే తాజాగా పవర్ స్టార్ అనే పేరుతో సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై విరమ్శనాత్మకంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు పోస్టర్లని చూస్తే తెలిసిపోతుంది. అయితే ఈ సినిమాతో మరో కొత్త రకమైన వ్యాపారం స్టార్ట్ చేసాడేమో అనిపిస్తోంది. ఇంతవరకు ఏటీటీ ద్వారా రిలీజ్ చేసిన రెండు సినిమాలకి ఫీజు వసూలు చేసిన ఆర్జీవీ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కి ట్రైలర్ చూడడానికి కూడా ఛార్జ్ చేయనున్నాడట.
అవును.. పవర్ స్టార్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ చూడాలన్న ఫీజు వసూలు చేస్తాడట. ట్రైలర్ ని చూడాలన్న డబ్బులు చెల్లించడం అనేది మరీ ఓవర్ గా అనిపిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయమై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలకి రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇస్తాడో లేదో చూడాలి.