Advertisementt

షూటింగ్ అంటే చాలు.. దణ్ణం పెట్టేస్తున్నారంట!

Wed 15th Jul 2020 11:20 AM
corona effect,tollywood,celebrities,anchor suma,anchor anasuya,no shootings  షూటింగ్ అంటే చాలు.. దణ్ణం పెట్టేస్తున్నారంట!
Corona Effect: Celebrities says no to Shootings షూటింగ్ అంటే చాలు.. దణ్ణం పెట్టేస్తున్నారంట!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనా మహమ్మారి సినిమా వాళ్ళని విపరీతంగా వణికిస్తుంది. టాలీవుడ్ సీరియల్స్ ఆర్టిస్ట్‌లు రోజుకొకరు కరోనా పాజిటివ్ బారిన పడుతున్నారు. నిన్నగాక మొన్న బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ ఫ్యామిలీ మొత్తం కరోనా మహమ్మారి చేతికి చిక్కారు. అమితాబచ్చన్ ఏదో చిన్న యాడ్ షూట్ కి వెళ్లడంతో ఆయనకి కరోనా సోకడం ఆయన నుండి ఫ్యామిలీ మొత్తానికి కరోనా రావడంతో ఇప్పుడు షూటింగ్స్ అంటేనే అందరూ భయపడిపోతున్నారు. టాలీవుడ్ హీరోలెవరు సెట్స్ కి వచ్చే సాహసం చెయ్యకపోవడం అనే విషయంపై ఇప్పటికే ఎన్నో వార్తలు ఇచ్చాం. ఇప్పుడు అమితాబ్‌కి కరోనా రావడంతో ఇప్పుడు టాప్ యాంకర్స్ కూడా మీకో దణ్ణం, మీ షూటింగ్ కో దణ్ణం అంటున్నారట.

షూటింగ్స్ మొదలవ్వగానే అనసూయ, సుమ లాంటి వాళ్ళు యమా ఉత్సాహంగా సెట్స్ మీదకెళ్లారు. శానిటైజర్స్, మాస్క్ లు సెట్స్ లో కరోనా జాగ్రత్తలు తీసుకుని సీరియల్స్ షూటింగ్ చేసిన వారికీ కరోనా సోకడం, వారినుండి కరోనా స్ప్రెడ్ అవడం, అలాగే జబర్దస్త్ నటులకు కరోనా బారిన పడడం ఇప్పుడు అనసూయ, సుమ కూడా షూటింగ్ కి పేకప్ చెప్పేశారనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. సుమ, అనసూయ లాంటోళ్లే చేతులెత్తేసి కరోనాకి దణ్ణం పెడుతుంటే.. మిగతావారు మాత్రం ఇంకేం చేస్తారు. సో ఇప్పుడు సీరియల్స్ తో పాటుగా షోస్ కూడా ఆగిపోనున్నాయన్నమాట.

Corona Effect: Celebrities says no to Shootings :

Fear in Tollywood Celebrities with Corona

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ