Advertisementt

రిలీజ్ డిస్కషన్స్‌లో.. ‘అస‌లేం జ‌రిగింది?’!

Wed 15th Jul 2020 11:10 AM
asalem jarigindi movie,release details,ott or theaters,sri ram,sanchitha,asalem jarigindi  రిలీజ్ డిస్కషన్స్‌లో.. ‘అస‌లేం జ‌రిగింది?’!
Asalem Jarigindi Movie in Release Discussions రిలీజ్ డిస్కషన్స్‌లో.. ‘అస‌లేం జ‌రిగింది?’!
Advertisement
Ads by CJ

తెలంగాణలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ..   

అస‌లేం జ‌రిగింది? థియేట‌ర్లా?? లేక ఓటీటీయా??

తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌ల ఆధారంగా రూపొందించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ ‘అస‌లేం జరిగింది’. చిత్ర పాట‌ల‌కు ఆడియ‌న్స్ నుంచి చ‌క్క‌టి స్పంద‌న వ‌స్తుంద‌ని చిత్ర నిర్మాత కింగ్ జాన్స‌న్ తెలిపారు. విజ‌య్ ఏసుదాస్‌, విజ‌య్ ప్ర‌కాష్‌, యాజిన్ నిజార్‌, మాళ‌విక‌, రాంకీ, భార్గ‌వి పిళ్లై వంటి ప్ర‌ముఖ సింగ‌ర్లు పాడిన పాట‌ల‌కు అమెజాన్ మ్యూజిక్‌, స్పాటిఫై, జియోసావ‌న్‌, యాపిల్ మ్యూజిక్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫార‌మ్స్ నుంచి చ‌క్క‌టి రెస్సాన్స్ వ‌స్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సెన్సార్ క్లియ‌రెన్స్ వ‌చ్చింద‌ని, థియేట‌ర్లు తెరుచుకునేంత‌వ‌ర‌కూ వేచి చూడాలా? లేక ఓటీటో ప్లాట్‌ఫార‌మ్స్‌లో రిలీజ్ చేయాలా? అనే విష‌యాన్ని అంత‌ర్గతంగా చ‌ర్చిస్తున్నామ‌ని వివ‌రించారు. 

ఎందుకంటే సినిమా అనుకున్న‌దానికంటే రిచ్‌గా వ‌చ్చింద‌ని, 8కే రిజ‌ల్యూష‌న్ కెమెరాతో రూపొందించిన ఈ సినిమాకు ప్ర‌ముఖ బ్యాక్ గ్రౌండ్ స్కోర‌ర్ ఎస్‌.చిన్నా ప్రాణం పోశార‌ని, సేతు స్పెష‌ల్ ఎఫెక్ట్స్ వంటివి ప్రేక్ష‌కుల్ని చివ‌రి వ‌ర‌కూ ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయ‌ని తెలిపారు. మంచి ప‌ర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క‌థకు హీరో శ్రీరాం ప్రాణం పోశాడ‌ని, అత‌ని న‌ట‌నాప్ర‌తిభను చూసి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ యేలేంద్ర మ‌హావీర్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందించిన అస‌లేం జ‌రిగింది సినిమా పాట‌ల‌ను ఆదిత్యా మ్యూజిక్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. ఐదు విభిన్న‌మైన గీతాల‌కు ఆడియ‌న్స్ నుంచి చ‌క్క‌టి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని చిత్ర నిర్మాత నీలిమా చౌద‌రి తెలిపారు.

Asalem Jarigindi Movie in Release Discussions:

Asalem Jarigindi Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ