Advertisementt

మెగాస్టార్ చెప్పిన లిస్ట్‌లో మరో డైరెక్టర్ సిద్ధం!

Wed 15th Jul 2020 08:24 AM
director bobby,script,chiranjeevi,mega star,lockdown,corona,acharya  మెగాస్టార్ చెప్పిన లిస్ట్‌లో మరో డైరెక్టర్ సిద్ధం!
One More director Ready for Chiranjeevi with Script మెగాస్టార్ చెప్పిన లిస్ట్‌లో మరో డైరెక్టర్ సిద్ధం!
Advertisement
Ads by CJ

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఎంత ఫాస్ట్‌గా సినిమాలు చేద్దామన్నా ఏదో ఒక విషయంలో ఆ సినిమాలు లేట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా కరోనాతో ‘ఆచార్య’ సినిమా సెట్స్ మీద ఆగిపోయింది. తర్వాత సాహో దర్శకుడు సుజిత్‌తో కలిసి లూసిఫర్ రీమేక్ చెయ్యబోతున్నాడు మెగాస్టార్ చిరు. అయితే చిరంజీవి మంచి కథలతో వస్తే ప్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తా అంటూ ప్రకటన చేసాడు. మెహర్ రమేష్, దర్శకుడు బాబీ లాంటి దర్శకులు తనని కథతో మెప్పించగలిగితే వాళ్ళతో సినిమాలు చేస్తా అంటూ కమిట్ అయ్యాడు. మరి చిరు లాంటి స్టార్ హీరో పిలిచి అవకాశం ఇస్తా అంటే ప్లాప్ దర్శకులు వదులుతారా...

అందుకే చిరు అలా చెప్పాడో లేదో ప్లాప్ దర్శకులంతా ఇలా రంగంలోకి దిగేశారు. అందులో మొదటగా దర్శకుడు బాబీ, చిరు కోసం కథ రాసుకుని కూర్చున్నాడట. ఎలాగూ లాక్‌డౌన్‌లో చిరంజీవి కూడా ఇంటికే పరిమితమయ్యాడు. సో ఫుల్ ఖాళీ. కాబట్టి ప్లాప్ దర్శకులు ఒక్కొక్కరిగా చిరు సలహాలతో కథలు సిద్ధం చేస్తున్నారట. అందులో భాగంగా దర్శకుడు బాబీ.. చిరు సలహాలు సూచనల మేరకు పూర్తి కమర్షియల్ హంగులతో చిరు హీరోయిజానికి సరిపోయే పవర్ ఫుల్ కథని సిద్ధం చేసాడని ఫిలింనగర్ టాక్. చిరు ప్రస్తుతం స్క్రీన్ మీద ఎలా కనబడితే బావుంటుంది, ఆయన వయసుకు, ఆయన ఎనర్జికి తగ్గ కథతో బాబీ చిరుకి కథ వినిపించాడని టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి చిరు ఈ సినిమాని ఎప్పుడు ఫైనల్ చేస్తాడో చూడాలి.

One More director Ready for Chiranjeevi with Script:

Bobby Script Ready for Mega Star Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ