Advertisementt

విజయ్ సేతుపతి క్లారిటీ.. పుష్పని ఇబ్బంది పెట్టొద్దనే..!

Tue 14th Jul 2020 08:22 AM
pushpa,allu arjun,vijay sethupathi,sukumar,devisriprasad  విజయ్ సేతుపతి క్లారిటీ.. పుష్పని ఇబ్బంది పెట్టొద్దనే..!
Vijay Sethupathi clarifies about Pushpa. విజయ్ సేతుపతి క్లారిటీ.. పుష్పని ఇబ్బంది పెట్టొద్దనే..!
Advertisement
Ads by CJ

అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఒకానొక పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ ప్రస్తుతం విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి.

రెమ్యునరేషన్ కారణాల వల్లనే తప్పుకున్నాడని, కాదు కాదు తమిళంలో విలన్ గా కనిపించడం ఇష్టం లేకే తప్పుకున్నాడని అన్నారు. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ చెక్ పెడుతూ విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న పుష్ప సినిమాలో తనకి మంచి పాత్ర దక్కిందనీ, కానీ కరోనా క్రైసిస్ వల్ల డేట్స్ అడ్జస్ట్ మెంట్ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశ్యంతోనే తప్పుకున్నానని చెప్పాడు.

తన డేట్స్ క్లాష్ అవడం వల్ల పుష్ప టీమ్ ని ఇబ్బంది పెట్టినట్టవుతుందని, అందువల్లే అలాంటి ఇబ్బందులు వారికి కలిగించకూడదనే సినిమా నుండి తప్పుకున్నాడట. అయితే పుష్పలో విజయ్ సేతుపతి పాత్రలో తమిళ నటుడు బాబీసింహా చేసే అవకాశం ఉందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Vijay Sethupathi clarifies about Pushpa.:

Vijay Sethupathi clarifies about Pushpa.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ