Advertisementt

కరణ్‌తో పూరి ‘ఫైటర్’ డిస్కషన్స్ స్టార్ట్స్!

Tue 14th Jul 2020 02:24 PM
karan johar,puri jagannadh,fighter,vijay deverakonda,discussions,charmi,mumbai,hyderabad  కరణ్‌తో పూరి ‘ఫైటర్’ డిస్కషన్స్ స్టార్ట్స్!
Puri Jagan Fighter discussions with Karan Johar కరణ్‌తో పూరి ‘ఫైటర్’ డిస్కషన్స్ స్టార్ట్స్!
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ కోసం ఫైటర్ కథ రాసి వినిపించగా.. విజయ్ దేవరకొండ ఈ కథతో పాన్ ఇండియా మూవీ చేద్దామని బాలీవుడ్‌లో తనకున్న పరిచయాలతో కరణ్ జోహార్‌తో కలిసి పూరి జగన్నాధ్ తో కలిసి ఈ సినిమాని నిర్మించేలా ప్లాన్ చేసాడు. పూరి - ఛార్మి - కరణ్ జోహార్‌లు సంయుక్తంగా ఫైటర్ సినిమాని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరణ్ జోహార్ కనుసన్నల్లో ముంబై పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 40 శాతం పూర్తయ్యింది. అయితే కరోనా అడ్డంకి వలన ఈ సినిమా షూటింగ్ ఆగింది కానీ.. లేదంటే పూరి జగన్నాధ్ స్పీడుకి ఈపాటికే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. అయితే కరోనా కారణంగా మిగిలిన షూటింగ్ ముంబైలో జరపలేమని, దానికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోనే ముంబై సెట్ వేసి సినిమాని షూటింగ్ చెయ్యబోతున్నారంటూ వార్తలొచ్చాయి.

 

అయితే ప్రస్తుతం కరణ్ జోహార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎవరికి అందుబాటులోకి రావడం లేదు. కనీసం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండడం లేదు. బాలీవుడ్ మొత్తం కరణ్ జోహార్ చుట్టూనే తిరుగుతుంది అని.. కరణ్ జోహార్ లాంటి వాళ్ళ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ సుశాంత్ అభిమానులు కరణ్ పై కత్తికట్టారు. కరణ్ జోహార్‌ని ఆయన అభిమానులే అన్ ఫాలో చెయ్యడం, నానారకాల తిట్లతో కరణ్ ని భయపెట్టడంతో కరణ జోహార్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నాడు. అయితే పూరి జగన్నాధ్ కరణ్ జోహార్ తో విజయ్ దేవరకొండ సినిమా విషయమై చర్చిస్తున్నాడని, హైదరాబాద్ లోనే సెట్ వేసి షూట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనని కరణ్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. కొన్ని సన్నివేశాలు యుఎస్ బ్యాక్ డ్రాప్ లో ఇంటర్నేషనల్ ఫైటర్స్ చిత్రీకరించాల్సి ఉండగా.. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని పూరి - కరణ్ డీప్ డిస్కర్షన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

Puri Jagan Fighter discussions with Karan Johar:

Fighter Movie Shooting discussions between Karan and Puri Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ