మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో రిలీజై మిశ్రమ స్పందనని తెచ్చుకుంది. థియేటర్లు మూసి ఉన్న కారణంగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికే నిర్మాతలు మొగ్గుచూపారు. అయితే ఈ సినిమాకి మెజారిటీ జనాల నుండి నెగెటివ్ టాక్ వచ్చింది. మహానటి హీరోయిన్ సినిమాపై అంచనాలు పెట్టుకున్నవాళ్లకి నిరాశే మిగిలింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏమంత థ్రిల్ ని కలగజేయలేకపోయింది.
పర్ఫార్మెన్స్ పరంగా కీర్తిసురేష్ కి మంచి మార్కులే పడినప్పటికీ ఓటీటీలో మంచి సినిమాలు రావట్లేదన్న అభిప్రాయాన్ని పోగొట్టలేకపోయింది. అయితే థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో ఆమె నటించిన మిగిలిన రెండు చిత్రాలు.. గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం మిస్ ఇండియా థియేటర్లలోనే వస్తుందని అంటున్నారు.
చిత్ర నిర్మాతలైన మహేష్ కోనేరు మిస్ ఇండియా చిత్రాన్ని పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన మిస్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ చాలా గెటప్పుల్లో కనిపించనుందట. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా కీర్తికి సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.