Advertisementt

బిగ్ బి ఎఫెక్ట్‌తో ఇప్పుడంతా వణికిపోతున్నారు!

Tue 14th Jul 2020 01:25 PM
corona,big b,celebrities,fear,tollywood,bollywood,rekha  బిగ్ బి ఎఫెక్ట్‌తో ఇప్పుడంతా వణికిపోతున్నారు!
Big B Effect: Celebrities says No to Shootings బిగ్ బి ఎఫెక్ట్‌తో ఇప్పుడంతా వణికిపోతున్నారు!
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ అందరూ కరోనాకి భయపడి సినిమా షూటింగ్స్‌కి వెళ్లడం లేదు. ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పటికీ... షూటింగ్ చేసే సాహసం చెయ్యడం లేదు. కరోనా కరోనా అంటూ ఎవరూ ఇంటి నుండి బయటికి రావడం లేదు. ఏ స్టార్ హీరో అయినా సాహసం చేస్తారా మనం కూడా మొదలు పెడదామని చిన్న చితక హీరోలు ఎదురు చూస్తున్నారు. కానీ పెద్ద, సీనియర్ హీరోలెవరూ సెట్స్ మీదకెళ్లే మూడ్ లేదు. కరోనా తగ్గాలి.... అప్పుడే సినిమా షూటింగ్స్ అంటున్నారు. అసలే సీరియల్స్ నటులు వరసగా కరోనా బారిన పడడంతో ఇప్పుడు సినిమా వాళ్లెవరూ షూటింగ్‌కి వెళ్లే సాహసం చెయ్యడం లేదు. ఇప్పుడే అలా ఉంటే.. తాజాగా బాలీవుడ్‌లో మెగాస్టార్ అమితాబ్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడడం, రేఖ ఇంట్లో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో రేఖ ఇల్లు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది.

మరోపక్క అనుపమ్ ఖేర్‌కి తప్ప ఆయన ఇంట్లోని వారికీ కరోనా రావడంతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే సల్మాన్ ఖాన్ ముంబైలోని ఓ స్టూడియోలో తన రాధే షూటింగ్‌ని చేస్తున్నాడని, ఆ స్టూడియోలోనే మిగిలిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇలా బాలీవుడ్ దిగ్గజాలు చాలామందికి కరోనా పాజిటివ్ రావడంతో ఇక స్టార్ హీరోలెవరూ సినిమా ఊసెత్తే సాహసం కూడా చేసేలా లేరు. బిగ్ బి త్వరగా కోలుకోవాలంటూ అన్ని భాషల నటులు ప్రేయర్స్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కరోనా చుట్టూ తిరుగుతుందో? లేదంటే కరోనానే బాలీవుడ్ చుట్టూ తిరుగుతుందో? అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. మరి బాలీవుడ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. టాలీవుడ్ హీరోలు కరోనా అంటే వణికిపోయే పరిస్థితి వచ్చేసింది. 

Big B Effect: Celebrities says No to Shootings:

Corona fear in Cine Celebrities goes High

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ