Advertisementt

బాలీవుడ్ డీజే లో హీరో.. ఆ ముగ్గురిలో ఎవరు..?

Mon 13th Jul 2020 02:22 PM
allu arjun,dj,duvvada jagannatham,dil raju,harish shankar  బాలీవుడ్ డీజే లో హీరో.. ఆ ముగ్గురిలో ఎవరు..?
Who will be the hero in Allu Arjun DJ Hindi remake..? బాలీవుడ్ డీజే లో హీరో.. ఆ ముగ్గురిలో ఎవరు..?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన డీజే (దువ్వాడ జగన్నాథమ్) సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను కురిపించింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుంద. ఈ రీమేక్ ని బాలీవుడ్ నిర్మాత బీఆర్ చోప్రాతో కలిసి దిల్ రాజు స్వయంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ రీమేక్ లో హీరోగా ఎవరు నటించనున్నారనేది ఆసక్తిగా మారింది.

మొదట్లో డీజే రీమేక్ ప్రస్తావన వచ్చినపుడు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా కనిపించనున్నాడని అన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మరో ఇద్దరు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పోషించిన పాత్రలో నటించడానికి  బాలీవుడ్ స్టార్ హీరోలైన టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఈ ముగ్గురిలో డీజే రీమేక్ లో ఎవరు నటించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. నిర్మాతలైన దిల్ రాజు ఏ హీరోని తీసుకుంటాడో చూడాలి.

Who will be the hero in Allu Arjun DJ Hindi remake..?:

Who will be the hero in Allu Arjun DJ Hindi remake..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ