Advertisementt

ఇంకా ఆ లుక్‌లోనే ఎందుకు బన్నీ..?

Tue 14th Jul 2020 08:16 AM
allu arjun,pushpa look,no change,walking,bunny walking,hyderabad  ఇంకా ఆ లుక్‌లోనే ఎందుకు బన్నీ..?
Comments started on Allu Arjun Pushpa Look ఇంకా ఆ లుక్‌లోనే ఎందుకు బన్నీ..?
Advertisement
Ads by CJ

ఇప్పుడు హీరోలు చాలామంది లాక్‌డౌన్ స్పెషల్ అంటూ గెడ్డం పెంచి మీసాలు పెంచుతుంటే.... అల్లు అర్జున్ మాత్రం పుష్ప కోసం పెంచిన గెడ్డాన్ని మెయింటైన్ చేస్తూ తిప్పలు పడుతున్నాడు. అందరూ ఇంట్లోనే వర్కౌట్స్, జిమ్ చేస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం రెగ్యులర్‌గా కేబీఆర్ పార్క్‌కి వాకింగ్ రావడం, వీలవదు అనుకున్నప్పుడు ఏ అవుట్ కట్స్‌కో వెళ్లి వాకింగ్ చేస్తుంటాడు. అయితే కరోనా రాకముందు అల్లు అర్జున్ పుష్ప కోసం ఫుల్‌గా రఫ్‌గా మేకోవర్ అయ్యాడు. గెడ్డం, మీసం, జుట్టు అంతా మాస్ టైప్‌లో పెంచి పోకిరివాడిలా తయారయ్యాడు.

అయితే లాక్‌డౌన్ ముగిసి సెట్స్ మీదకెళదామనుకుంటే... కరోనా ఇంకా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. సుకుమార్ పుష్ప కోసం ఓ ప్లాన్ చేసి హైదరాబాద్ చివరిలో లేదా కరీంనగర్ దగ్గర అడవుల్లో పుష్ప షూటింగ్ ప్లాన్ చేసి కరోనా విషయంలోనూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడున్న సమస్య. అయితే అల్లు అర్జున్ మాత్రం పుష్ప లుక్‌లోనే కంటిన్యూ అవుతున్నాడు. అందరూ లాక్‌డౌన్‌లో మీసం, గెడ్డాలు పెంచి తిరుగుతుంటే.. అల్లు అర్జున్ మాత్రం పుష్ప మేకోవర్‌లోనే కష్టపడుతున్నాడు. ఇక బన్నీ అభిమానులు ఇప్పుడప్పుడే పుష్ప షూటింగ్ అయ్యేలా లేదు.. ఇంకా ఆ లుక్‌నే ఏంటి బ్రదర్ అంటున్నారు.

Comments started on Allu Arjun Pushpa Look:

No Change in Allu Arjun Pushpa Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ