Advertisementt

కరోనా ఎఫెక్ట్.. వాళ్ళిద్దరూ యాంకరింగ్ చేయట్లేదట..?

Mon 13th Jul 2020 08:43 AM
coronavirus,covid19,suma,anchor anasuya  కరోనా ఎఫెక్ట్.. వాళ్ళిద్దరూ యాంకరింగ్ చేయట్లేదట..?
Corona effect.. those two are not interested to Anchoring..? కరోనా ఎఫెక్ట్.. వాళ్ళిద్దరూ యాంకరింగ్ చేయట్లేదట..?
Advertisement
Ads by CJ

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా, టీవీ షూటింగులకి అనుమతులు ఇచ్చిన వెంటనే అప్పటి వరకూ ఇంట్లోనే గడిపిన నటీనటులు, టీవీ వర్కర్లు సెట్ మీదకి వచ్చారు. సీరియల్స్, టీవీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి. కానీ అదే క్రమంలో మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా షూటింగులని ఆపేస్తున్నారు. కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతూనే ఉండడం, హైదరాబాద్ లో దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండడం వల్ల షూటింగులకి వెళ్ళడానికి భయపడుతున్నారు. 

అదీగాక ఇప్పటికే పలువురు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో భయం ఇంకా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో స్టార్ యాంకర్లు అయిన సుమ, అనసూయ షూటింగులకి వెళ్లకూడదని నిశ్చయించుకున్నారట. ఇప్పటికే వీరిద్దరూ చాలా ప్రోగ్రామ్స్ చేసారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారుతుండడంతో కొని రోజులు ప్రోగ్రామ్స్ చేయకపోవడమే ఉత్తమం అని భావిస్తున్నారట. మరి వీరిద్దరినీ ఇంకెంతమంది అనుసరిస్తారో చూడాలి.

Corona effect.. those two are not interested to Anchoring..?:

Corona effect.. those two are not interested to Anchoring..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ