ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sai Dharam Tej playing interesting role in his next..!

కెరీర్లోనే మొదటిసారిగా... ఇంట్రెస్టింగ్ పాత్రలో సాయి ధరమ్ తేజ్..!

Sai Dharam Tej playing interesting role in his next..!

వరుస ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో విజయం అందుకుని, ఆ తర్వాత ప్రతీరోజూ పండగే చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు అనే చిత్రాన్ని చేస్తున్నాడు. సుబ్బు దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన నో పెళ్ళి అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ దేవకట్టా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

వెన్నెల, ప్రస్థానం, ఆటో నగర్ సూర్య వంటి చిత్రాల దర్శకుడు దేవకట్టాతో సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్, ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపిస్తున్నాడట. కెరీర్లో ఇప్పటి వరకూ చేయని సీరియస్ రోల్ లో నటిస్తున్నాడని అంటున్నారు. కరోనా తగ్గాక షూటింగ్ కి స్టార్ట్ కానున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసరుగా కనిపించనున్నాడట. అంతే కాదు కథా ప్రకారం ఈ సినిమా పూర్తిగా ఉత్తర భారతదేశంలో జరుగుతుందట.

అయితే ఐఏఎస్ పాత్ర కోసం ఆ పాత్రకి తగ్గట్లుగా బాడీని మెయిన్ టైన్ చేస్తున్నాడట. అంతే కాదు ఐఏఎస్ ల ఇంటర్వ్యూలు చూస్తూ వారి బాడీ లాంగ్వేజీని అర్థం చేసుకుంటున్నాడని టాక్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే, ఈ సినిమా ఏదో సమాజానికి సందేశాన్నిచ్చేదే అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. మరి దేవకట్టా ఈ సినిమాలో ఏ ఇష్యూని టచ్ చేస్తాడో చూడాలి.

Sai Dharam Tej playing interesting role in his next..!

sai dharam tej
devakatta
solo brathuke so better