Advertisementt

ఆహా కోసం వేణు ఊడుగుల వెబ్ సిరీస్ ..?

Sun 12th Jul 2020 02:12 PM
venu udugula,aha,needi naadi oke katha,rana,suresh babu  ఆహా కోసం వేణు ఊడుగుల వెబ్ సిరీస్ ..?
Venu Udugula planning web series for Aha..? ఆహా కోసం వేణు ఊడుగుల వెబ్ సిరీస్ ..?
Advertisement
Ads by CJ

అల్లు అరవింద్ సొంత ఓటీటీ సంస్థ అయిన ఆహా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. లాక్డౌన్ సమయంలో కొత్త కొత్త సినిమాలని రిలీజ్ చేస్తూ సబ్ స్క్రయిబర్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఓటీటీలో మేజర్ ఫీల్డ్ కి ఆక్రమించిన పోటీదారులకి పోటీగా కొత్త కొత్త వెబ్ సిరీస్ లని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది దర్శకులు ఆహా కోసం వెబ్ సిరీస్ లని రూపొందించే పనిలో ఉన్నారు.

తాజాగా వేణు ఊడుగుల కూడా వెబ్ సిరీస్ ని రూపొందించనున్నాడని ప్రచారం జరుగుతోంది. నీది నాది ఒకే కథ సినిమా ద్వారా దర్శకుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకుని రెండవ చిత్రంగా రానాతో విరాట పర్వం సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తొంభై శాతానికి పైగా పూర్తయిందట. అయితే విరాట పర్వం ఔట్ ఫుట్ చూసిన సురేష్ బాబు సంతృప్తిగా ఫీల్ అయ్యాడట.

దాంతో ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ ఆహా కోసం వెబ్ సిరీస్ ని చేయమని అడిగాడట. దానికి వేణు ఒప్పుకున్నాడని సమాచారం. ప్రస్తుతానికి అధికారిక సమాచారం రానప్పటికీ కన్ఫర్మ్ అనే అంటున్నారు. చలం రాసిన ఒకానొక కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందనుందట.

Venu Udugula planning web series for Aha..?:

Venu Udugula planning web series for Aha..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ