Advertisementt

డొనేట్ ప్లాస్మా అంటూ శ్రీ విష్ణు సరికొత్త ఛాలెంజ్..

Sun 12th Jul 2020 01:41 PM
sri vishnu,coronavirus,covid19,donate plasma and save life  డొనేట్ ప్లాస్మా అంటూ శ్రీ విష్ణు సరికొత్త ఛాలెంజ్..
Hero Srivishnu donate plasma challenge.. డొనేట్ ప్లాస్మా అంటూ శ్రీ విష్ణు సరికొత్త ఛాలెంజ్..
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో ఛాలెంజిలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజెస్ రన్ అవుతూనే ఉంటాయి. లాక్డౌన్ సమయంలో మగవాళ్ళు ఇంటి పనుల్లో ఆడవాళ్లకి సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో బీ ద రియల్ మాన్ ఛాలెంజి ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మొక్కలు నాటమని గ్రీన్ ఇండియా ఛాలెంజిని విసురుతున్నారు. అయితే వీటికి భిన్నంగా హీరో శ్రీ విష్ణు సరికొత్త ఛాలెంజితో వచ్చాడు. 

కరోనా కారణంగా ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారు క‌రోనాతో బాధ‌ప‌డుతున్న వారికి త‌మ ప్లాస్మాని దానం చేస్తే వారిని కాపాడ‌వ‌చ్చనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లాస్మా విషయంలో అవగాహన కల్పించడానికి శ్రీ విష్ణు తన ట్విట్టర్ అకౌంట్ డిస్ ప్లే పిక్ ని  డొనేట్ ప్లాస్మా అంటూ మార్చాడు. 

ఇలా ఇంకా అందరికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశ్యంతో తమ అకౌంట్ ప్రొఫైల్ పిక్ మార్చుకోవాలని ఆ ఛాలెంజిని నారా రోహిత్ తో పాటు హీరోయిన్ నివేథా థామస్ కి విసిరాడు.  ఈ ఛాలెంజిని స్వీకరించిన నారా రోహిత్ తన అకౌంట్ ప్రొఫైల్ పిక్ ని మార్చుకుని అల్లరి నరేష్, మంచు మనోజ్ లకి విసిరారు. మొత్తానికి శ్రీ విష్ణు స్టార్ట్ చేసిన ఛాలెంజ్ బాగానే వైరల్ అవుతోంది. 

Hero Srivishnu donate plasma challenge..:

Hero Srivishnu donate plasma challenge..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ