Advertisementt

వంద మిలియన్లు చేరుకున్న మహేష్ పాట..

Sat 11th Jul 2020 02:52 PM
mahesh babu,sarileru neekevvaru,mindblock song  వంద మిలియన్లు చేరుకున్న మహేష్ పాట..
Mahesh Mondblock song reached 100 million mark వంద మిలియన్లు చేరుకున్న మహేష్ పాట..
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి రిలీజైన రెండు సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకీవరు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అయితే ఈ సినిమాల మధ్య పోటీ సినిమా విడుదలకి ముంచునుంచే కొనసాగుతూ వచ్చింది. సినిమాలోని పాటల రిలీజ్ దగ్గరనుండి నడిచిన పోటీ రిలీజయ్యాక మరింత పెరిగింది. అయితే ప్రస్తుతం ఈ పోటీ ఇంకా నడుస్తున్నట్టే కనిపిస్తుంది. అలవైకుంఠపురములో సినిమాలోని పాటలు వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డుని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 

నిన్నటికి నిన్న అలవైకుంఠపురములో బుట్టబొమ్మ పాట టాలీవుడ్ లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న వీడియో సాంగ్ గా రికార్డు సృష్టించింది. ఈ మేరకు బన్నీ అభిమానులు ఈ రికార్డుని హైలైట్ చేసారు. అయితే తాజాగా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ కూడా సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మాస్ సాంగ్ మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ వంద మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది. 

దీంతో మహేష్ అభిమానులు ఊరుకుంటారా. సోషల్ మీడియా వేదికగా మైండ్ బ్లాక్ సాంగ్ పై ట్వీట్లు వేస్తున్నారు. మొత్తానికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్య పోటీ ఇంకా నడుస్తూనే ఉందన్నమాట.

Mahesh Mondblock song reached 100 million mark:

Mahesh Mondblock song reached 100 million mark

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ