Advertisementt

తాప్సీ సినిమాకి కరోనా ఇన్స్యూరెన్స్..

Sat 11th Jul 2020 01:33 PM
tapsee pannu,loop lapeta,coronavirus,covid19,corona insurance  తాప్సీ సినిమాకి కరోనా ఇన్స్యూరెన్స్..
Corona Insurance for Tapsee Movie..? తాప్సీ సినిమాకి కరోనా ఇన్స్యూరెన్స్..
Advertisement
Ads by CJ

కరోనా సంక్షోభం వల్ల సినిమా షూటింగులకి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని కారణంగా నిర్మాతలు సినిమాల షూటింగులు మొదలుపెట్టడం లేదు. నటీనటులు కూడా ఇప్పుడప్పుడే షూటింగులకి వచ్చేందుకు సిద్ధపడట్లేదు. టెలివిజన్ సీరియల్స్ షూటింగ్స్ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా వాళ్ళకి భయం ఇంకా ఎక్కువైంది.

ముఖ్యంగా నిర్మాతలు ఈ విషయంలో చాలా సందేహిస్తున్నారు. ఒకవేళ సినిమా స్టార్ట్ చేసి, మధ్యలో అందులో ఎవరికైనా కరోనా వస్తే షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నిర్మాతకి చాలా నష్టం వస్తుంది. అందువల్ల నిర్మాతలెవరూ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అయితే తాజాగా సినిమా షూటింగులకి ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారట. దీనివల్ల ఒకవేళ యూనిట్ లో ఎవరికైనా కరోనా సోకి సినిమా షూటింగ్ ఆగిపోయినా ఆ నష్టాన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీ భరిస్తుందట.

ఈ మేరకు తాప్సీ కొత్త చిత్రం లూప్ లపేటా చిత్రానికి ఈ ఇన్స్యూరెన్స్ చేయించనున్నారట. ఇప్పటికే దీనికి అప్లై చేసారట. మరి ఇది గనక్ అ ఓకే అయితే కరోనా ఇన్స్యూరెన్స్ పొందిన మొదటి సినిమాగా తాప్సీ లూప్ లపేటా గుర్తింపు పొందుతుంది. అలాగే మరికొంత మంది నిర్మాతలు కూడా ముందుకు వస్తారు. 

Corona Insurance for Tapsee Movie..?:

Corona Insurance for Tapsee Movie..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ