ప్రభాస్20 ఇప్పుడు ‘రాధేశ్యామ్’.. శనివారం ప్రభాస్ - రాధాకృష్ణ మూవీ లుక్ మాత్రమే కాదు... టైటిల్ కూడా విడుదల చేయడంతో.. ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ప్రభాస్ కొత్త మూవీ లుక్, టైటిల్ అన్ని టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసాయి. గత ఐదారు నెలలుగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కొత్త మూవీ లుక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ అండ్ టీం మాత్రం ఊరించి ఊరించి నిన్నటికి లుక్ అండ్ టైటిల్ వదిలారు. రాధేశ్యామ్ అంటూ పూజా హెగ్డేతో ప్రభాస్ డీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. ప్రభాస్ లుక్ అలా వదిలారో లేదో.. ఇలా సోషల్ మీడియాలో రాధే శ్యామ్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ పంచుకోగా 1 మిలియన్ లైక్స్ అందుకోని ఈ సినిమా లుక్ రికార్డు క్రియేట్ చేసింది.
అయితే టాప్ ట్రెండింగ్, రికార్డుల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్రభాస్ అండ్ టీం రాధేశ్యామ్ లుక్‌ని ఇతర సినిమాల నుండి కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో న్యూస్ రైజ్ అయ్యింది. ఏ సినిమా లుక్ అయినా సోషల్ మీడియాలో వదలగానే విమర్శకులు.. ఆ లుక్ ఇతర సినిమాల లుక్స్ తో పోల్చి చూసి.. ఎక్కెడెక్కడ కాపీ కొట్టారో చిలవలు పలవలు వలిచి అదిగో కాపీ.. ఇదిగో కాపీ అన్నట్టుగానే రాధేశ్యామ్ లుక్ కూడా ఏ ఏ సినిమాల కాపీనో.. ఎక్కెడెక్కడ అతుకులు వేసారో చెబుతున్నారు. ప్రభాస్ - పూజా హెగ్డే లుక్‌ని బాలీవుడ్ రామ్ లీల నుండి, అలాగే తెలుగులో వరుణ్ తేజ్ - ప్రగ్యా జైస్వాల్‌ల కంచె సినిమా లుక్ నుండి కాపీ కొట్టినట్టుగా ఇప్పడు సోషల్ మీడియాలో రామ్ లీల లుక్, కంచె లుక్స్‌ని వైరల్ చేస్తున్నారు. రాధేశ్యామ్ లుక్ - కంచె లుక్ - రామ్ లీల లుక్స్ ని పక్క పక్కన బెట్టి మరీ వాడేసుకుంటున్నారు. ఇంకా రాధేశ్యామ్ లుక్‌లో ఫోటో వర్క్ అంతగా లేదని.. ఇలా ఏదో ఒక కామెంట్‌తో ఇప్పడు రాధేశ్యామ్‌ని ఆడుకుంటున్నారు నెటిజెన్స్.