Advertisementt

పాయల్ ఘోష్ మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందా..?

Fri 10th Jul 2020 02:08 PM
payal ghosh,ntr,balayya,boyapati  పాయల్ ఘోష్ మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందా..?
Payal ghosh again entry into Telugu film..? పాయల్ ఘోష్ మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందా..?
Advertisement
Ads by CJ

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రయాణం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన భామ పాయల్ ఘోష్ ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఊసరవెల్లిలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా కనిపించలేదు. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై వచ్చిన వార్తల ద్వారా మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం పాయల్ ఘోష్ మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందట.

బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో పాయల్ ఘోష్ ఒకానొక పాత్రలో నటించనుందని అంటున్నారు. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త అమ్మాయి నటించనుందని బోయపాటి స్పష్టం చేసాడు. ఇంకా టైటిల్ నిర్ణయింపబడని ఈ సినిమాకి మోనార్క్, సూపర్ మాన్ అనే టైటిళ్ళని పరిశీలిస్తున్నారు.

మరి ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పాయల్ ఘోష్ ఇందులో నటిస్తుందో లేదో చూడాలి. ఈ అవకాశం వస్తే గనక ఆమెకి మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Payal ghosh again entry into Telugu film..?:

Payal Ghosh in Balayya movie..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ