Advertisementt

‘రాధేశ్యామ్’ అంటూ ఫస్ట్‌లుక్‌తో వచ్చిన ప్రభాస్!

Fri 10th Jul 2020 12:41 PM
young rebel star,prabhas 20 film,radhe shyam,radha krishna kumar,uv creations,gopikrishna movies,pooja hegde  ‘రాధేశ్యామ్’ అంటూ ఫస్ట్‌లుక్‌తో వచ్చిన ప్రభాస్!
Young Rebel star Prabhas 20 Film First Look Released ‘రాధేశ్యామ్’ అంటూ ఫస్ట్‌లుక్‌తో వచ్చిన ప్రభాస్!
Advertisement
Ads by CJ

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్, రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’

‘బాహుబలి1, బాహుబ‌లి2, సాహో’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు స‌మ‌ర్పించ‌గా.. వంశీ, ప్ర‌మెద్‌, ప్ర‌శీదలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌‌పై నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే యూర‌ప్ లాంటి విదేశాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరణ జరుపుకొని 70 శాతం టాకీ పార్ట్‌ని పూర్తిచేసుకుంది. మిగ‌తా షూటింగ్ పార్ట్‌ని ఈ కోవిడ్‌-19 ప్ర‌భావం ముగిసిన వెంట‌నే సెట్స్ మీద‌కి తీసుకువెళతారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ మ‌రియు టైటిల్ కోసం యావ‌త్ ప్ర‌పంచంలోని అభిమానులంతా ఎంత‌లా ఎదురు చూశారో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ క్ష‌ణం ఈరోజు రావ‌టంతో అభిమానులంతా సంబ‌రాల్లో మునిగిపోయారు. ఈరోజు ఈ చిత్రం టైటిల్‌ని ‘రాధేశ్యామ్’ అంటూ అనౌన్స్ చేశారు. దాంతో పాటే మొద‌టిలుక్‌ని కూడా రిలీజ్ చేశారు. అలానే ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవ్వనుంది.

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌-రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్‌

బాహుబలి రెండు పార్టుల త‌రువాత ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు, అంతే కాదు సౌత్ ఇండియాలో మొట్ట‌మెుద‌టి పాన్ ఇండియా స్టార్‌గా ప్ర‌భాస్ రికార్డ్ సాధించారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో రెవెన్యూ ప‌రంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స‌త్తా మ‌రొక్క‌సారి చాటింది. అలాగే జిల్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా 100 మార్క్‌లు వేసుకున్న ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్. వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రం ఢిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతుంది. మేక‌ర్‌గా మంచి గుర్తింపు పొందిన రాధాకృష్ణ కుమార్‌కి రెండ‌వ చిత్రంగా ఇది తెర‌కెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేష‌న్ కోసం అభిమానుల్లో మ‌రియు సినిమా ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి.

గోపీకృష్ణ మూవీస్‌-యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో

రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్ బ్యాన‌ర్‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు కృష్ణంరాజు నిర్మించారు. మంచి క‌థాబ‌లం వున్న చిత్రాలు నిర్మిస్తూ స‌క్స‌ెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోపీకృష్ణ మూవీస్ బ్యాన‌ర్ ఇప్ప‌ుడు లేటెస్ట్ స‌క్స‌ెస్ ఫుల్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి నిర్మాణం చేప‌ట్ట‌టంతో ‘రాధేశ్యామ్’ ట్రేడ్‌లో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌-పూజాహెగ్డే కాంబినేష‌న్‌

‘రాధేశ్యామ్‌’ అనే టైటిల్‌ని వీరిద్దరి కాంబినేష‌న్ చూసి పెట్టారా అనుకునేలా ఈ జంట మొద‌టి లుక్‌లో ఉన్నారంటే ఆశ్చ‌ర్యం లేదు.. అంత‌లా ఇమిడిపోయారు ఈ స్టిల్‌లో. ఇటీవ‌లే బుట్ట‌బొమ్మగా ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్ని ఆక‌ట్టుకున్న పూజాహెగ్డే ఈ చిత్రంలో మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటుంది. ప్రేమికులుగా రాధేశ్యామ్ అని అంద‌రి ప్ర‌శంశ‌లు పొందే విధంగా ఈ మొద‌టి లుక్ ఆకట్టుకోవటం విశేషం.

‘రాధేశ్యామ్’ మొద‌టి లుక్‌

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజాహెగ్డేల‌తో బార్బిడాల్ డాన్స్ పోజ్ తో రిలీజ్ చేసిన మొద‌టి లుక్ చాలా ల‌వ్‌లీ గా వుండ‌టం అంద‌ర్ని ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ప్ర‌భాస్‌, పూజా ఇద్ద‌రూ ప్రేమ‌కి ప్ర‌తిరూపంగా వుండ‌టం.. ఎర్ర‌టి స‌ముద్రాన్ని గౌనుగా వాడ‌టం ద‌ర్శ‌కుడి క్రియేటివిటి క‌నిపిస్తుంది. ప్రేమ‌ని చూపిస్తూ దాని వెన‌క స‌మ‌స్య‌ని ఈ పిక్చ‌ర్ లో చూపించారు. చెప్ప‌క‌నే చెప్పారు రెబ‌ల్‌స్టార్ రేంజ్‌ని ఈ లుక్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌ర్నీ ఆక‌ట్టుకోవ‌టంతో యూనిట్ అంతా ఆనందంగా వున్నారు.

ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు:

చిత్ర స‌మ‌ర్ప‌కులు : ‘రెబ‌ల్‌స్టార్’ డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటర్: కోటగిరి వెంక‌టేశ్వ‌రావు

యాక్ష‌న్‌, స్టంట్స్‌: నిక్ ప‌వ‌ల్‌

సౌండ్ డిజైన్: ర‌సూల్ పూకుట్టి

కొరియోగ్ర‌ఫి: వైభ‌వి మ‌ర్చంట్‌

కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌: తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని

విఎఫ్‌ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌: క‌మ‌ల్ క‌న్న‌న్‌

ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: ఎన్‌.సందీప్‌

హెయిర్‌స్టైల్‌‌: రోహ‌న్ జ‌గ్ట‌ప్‌

మేక‌ప్‌: త‌ర‌న్నుమ్ ఖాన్

స్టిల్స్‌: సుద‌ర్శ‌న్ బాలాజి

ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: క‌బిలాన్‌

పిఆర్ఓ: ఏలూరు శ్రీను

కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌: ఆడోర్ ముఖ‌ర్జి

ప్రోడక్షన్ డిజైనర్: ర‌‌వీంద‌ర్‌

నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా

దర్శకుడు: రాధాకృష్ణ కుమార్

Young Rebel star Prabhas 20 Film First Look Released:

Young Rebel star Prabhas 20 Film Title Radhe Shyam announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ