Advertisementt

ఆహా కోసం అల్లు అరవింద్ ఆ సినిమాని కొనేసాడు..?

Thu 09th Jul 2020 05:31 PM
johaar,allu aravind,aha app,telugu,ott,bhanumati ramakrishna,krishna and his leela  ఆహా కోసం అల్లు అరవింద్ ఆ సినిమాని కొనేసాడు..?
Allu Aravind bought a new movie johaar..? ఆహా కోసం అల్లు అరవింద్ ఆ సినిమాని కొనేసాడు..?
Advertisement
Ads by CJ

మహమ్మారి కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో వినోదమంతా కేవలం ఫోన్లు, ల్యాప్ టాప్ లకే సరిపోయింది. మళ్లీ థియేటర్ కి వెళ్ళి ఎప్పుడు చూస్తామోనని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. అయితే థియేటర్లు మూసి ఉన్న కారణంగా చాలా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకి మంచి స్పందన వస్తుంది కూడా. అయితే ఓటీటీలో ముందున్న ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి వాటికి పోటీగా అల్లు అరవింద్ ఆహా వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రత్యేకించి తెలుగు కంటెంట్ కోసమే తయారు చేసిన ఈ ఆహా స్ట్రీమింగ్ సైట్ మంచి స్పందనని తెచ్చుకుంటుంది. ఈ మేరకు అల్లు అరవింద్ ఆహా కోసం వెబ్ సిరీస్ లని రూపొందించడంతో పాటు కొత్త సినిమాలని కూడా కొనేస్తున్నాడు. మొన్నటికి మొన్న భానుమతి రామక్రిష్ణ, క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకి పాజిటివ్ రివ్యూస్ రావడమే కాదు వ్యూస్ కూడా పెరిగాయి.

అయితే తాజాగా మరో తెలుగు చిత్రం జోహార్ కూడా ఆహాలో రిలీజ్ కాబోతుందని అంటున్నారు. అభిషేక్ నామా సమర్పణలో సందీప్ మర్ని నిర్మాతగా రూపొందిన ఈ చిత్రానికి అనిల్ తేజ మర్ని దర్శకత్వం వహించాడు. మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం ఆహాలో డైరెక్ట్ స్ట్రీమింగ్ అవనుందట. మరి ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

Allu Aravind bought a new movie johaar..?:

Allu Aravind bought a new movie johaar..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ