Advertisementt

ప్రభాస్ 20లో ఎయిర్ టెల్ గర్ల్...?

Thu 09th Jul 2020 04:34 PM
airtel girl,sashaa chetri,prabhas20,pooja hegde  ప్రభాస్ 20లో ఎయిర్ టెల్ గర్ల్...?
Airtel girl in Prabhas 20th Movie..? ప్రభాస్ 20లో ఎయిర్ టెల్ గర్ల్...?
Advertisement
Ads by CJ

ప్రభాస్ 20వ చిత్రంపై అప్డేట్ ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నోరోజులుగా ఎంతగా కోరుకున్నారో అందరికీ తెలిసిందే. గతంలో ఎప్పుడూ ఏ హీరో ఫ్యాన్స్ ఈ రేంజ్ లో చిత్రబృందాన్ని రిక్వెస్ట్ చేసి ఉండదు. ఒకానొక దశలో చిత్ర నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ ని బ్యాన్ చేస్తున్నామంటూ ట్రెండ్ చేసే దాకా వెళ్ళిందంటే వాళ్ళెంతగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా చిత్రబృందం ప్రభాస్ 20వ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నామంటూ అభిమానులకి పండగలాంటి వార్తని అందించింది.

జులై 10వ తేదీ అనగా రేపు ఉదయం 10గంటలకి ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ రాబోతుంది. ఈ మేరకు డార్లింగ్ అభిమానులు ట్రెండ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే ప్రభాస్ 20వ చిత్రం అప్డేట్ రాకముందే ఆ సినిమాలో సెన్సేషనల్ సెలెబ్రిటీ నటిస్తుందన్న వార్తలు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఎయిర్ టెల్ యాడ్ తో దేశమంతా పాపులర్ అయిన సశా ఛెత్రి ఈ సినిమాలో ఒకానొక పాత్రలో కనిపించనుందని అంటున్నారు.

పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సశా ఛెత్రి, ప్రభాస్ చెల్లెలిగా నటిస్తుందట. ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి సమాచారం రానప్పటికీ నేషనల్ మీడియాలో ఈ సమాచారం వైరల్ అవుతోంది. మరి చిత్రబృందం స్పందిస్తేనేగానీ అసలు విషయం బయటకి రాదు.

Airtel girl in Prabhas 20th Movie..?:

Airtel girl in Prabhas 20th Movie..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ