అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే బాక్సాఫీసు పరంగానే కాదు టెలివిజన్లోనూ సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా టెలివిజన్ లో ఉగాది రోజున మొదటిసారి టెలిక్యాస్ట్ అయ్యింది. అప్పుడు రికార్డు స్థాయిలో బాహుబలి 2 రేటింగ్స్ (22.7)ని మించి 23.4 రేటింగ్స్ ని సాధించి తెలుగు టీవీ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ దక్కించుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
అయితే జూన్ 28వ తేదీన మరోసారి టెలిక్యాస్ట్ అయిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి 17.4 రేటింగ్స్ వచ్చాయి. ఒక సినిమా సెకండ్ టైమ్ టెలిక్యాస్ట్ కి ఈ రేంజ్ లో రేటింగ్స్ రావడం ఇదే ప్రథమం అని చెబుతున్నారు. రెండవసారి ప్రసారం అయిన సినిమాల రేటింగ్స్ విషయంలోనూ సరిలేరు నీకెవ్వరు సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి గారు కీలక పాత్రలో నటించింది.