టెలివిజన్ షోస్ అన్నింటిలోకి అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాలుగవ సీజన్ కోసం సిద్ధం అవుతోంది. కరోనా కారణంగా నాలుగవ సీజన్ ఉంటుందా, ఉండదా అని అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇచ్చిన కారణంగా మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ నాలుగవ సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మొదటి సీజన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసాడు. ఇక మూడవ సీజన్ కి నాగార్జున హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే నాలుగవ సీజన్ కి కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా అన్ని రంగాల ఆర్థిక విషయాలపై ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అందువల్ల నాలుగవ సీజన్ కి నాగార్జున తన రెమ్యునరేషన్ ని తగ్గించుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున తన రెమ్యునరేషన్ ని తగ్గించుకోవడం లేదట. మూడవ సీజన్ కి ఎంత పారితోషికం అందుకున్నాడో నాలుగవ సీజన్ కి కూడా అంతే తీసుకోనున్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్ల వేటలో పడింది.