Advertisementt

‘ఆర్ఆర్ఆర్’ పక్కనెట్టి మహేష్ కోసమంటే నమ్మేదెలా?

Fri 10th Jul 2020 08:06 AM
mahesh babu,ss rajmouli,script work,rrr movie,rumors,mahesh and rajamouli  ‘ఆర్ఆర్ఆర్’ పక్కనెట్టి మహేష్ కోసమంటే నమ్మేదెలా?
What Is Rajamouli Planning For Mahesh Babu? ‘ఆర్ఆర్ఆర్’ పక్కనెట్టి మహేష్ కోసమంటే నమ్మేదెలా?
Advertisement
Ads by CJ

రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్స్ పనుల్లో బిజీగానే గడుపుతున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ వాయిదా పడడం తప్ప.. ఆ సినిమాకి సంబంధించిన చాలా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా అవి ఆగలేదు. రాజమౌళి ఆ పనులు సంగతి సరే సినిమా షూటింగ్ మొదలెడితే బావుండు అంటూ రాజమౌళి ఎదురు చూస్తుంటే కరోనా వలన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకా వెనక్కి వెళుతూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ అయితే ఓకే కానీ, బాలీవుడ్ నటులు, హీరోయిన్స్‌కి ఎక్కడ డేట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయో అని రాజమౌళి ఓ పక్కన కంగారు పడుతుంటే.. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌తో సినిమాకి ఫిక్స్ అయ్యాడు. ఖచ్చితంగా మహేష్‌తోనే సినిమా అన్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది పూర్తయితే... కొద్దిగా గ్యాప్ తీసుకుని.. మహేష్ కథపై కూర్చుంటాడని అన్నారు. కానీ ప్రస్తుతం కరోనాతో బాగా ఖాళీ అయ్యి ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పనులు కూడా ఓ కొలిక్కి రావడంతో.. చేసేది లేక రాజమౌళి, మహేష్ సినిమా స్క్రిప్ట్ అయినా ప్రిపేర్ చేస్తే బావుంటుంది అని.. మహేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. మరి రాజమౌళి ఓ సినిమా పూర్తిగా కంప్లీట్ అయితేనే కానీ.. మరో సినిమా కోసం రెడీ అవ్వడు. అందులోను ఆర్ఆర్ఆర్ లాంటి రిస్క్ సినిమాని పక్కనబెట్టి రాజమౌళి అప్పుడే మహేష్ కోసం కథ అంటే నమ్మ బుద్ది కావడం లేదు. కానీ కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు కాబట్టి.. రాజమౌళికి బోర్ కొట్టి మహేష్ స్క్రిప్ట్ ఏమన్నా చేయిస్తున్నాడేమో అనే వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఆయన స్పందిస్తేనే కానీ తెలియదు.

What Is Rajamouli Planning For Mahesh Babu?:

Rumors on Mahesh Babu, Rajamouli Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ