Advertisementt

బండ్లబాబు అంత మాట అనేశాడేంటి?

Fri 10th Jul 2020 08:02 AM
bandla ganesh,sensational comments,sarileru neekevvaru role,mahesh babu  బండ్లబాబు అంత మాట అనేశాడేంటి?
Bandla Ganesh Sensational Comments on Sarileru Neekevvaru Role బండ్లబాబు అంత మాట అనేశాడేంటి?
Advertisement
Ads by CJ

బండ్ల గణేష్ ఎప్పుడు ఏదో ఓ రకంగా ఈ మధ్య న్యూస్‌లోనే ఉంటున్నాడు. సినిమాల్లో మాత్రమే కాదు..  బ్లేడు, గొంతు అంటూ కామెడీ చెయ్యడం, తర్వాత నా కోళ్ల ఫార్మ్స్ ని కాపాడండి అంటూ మొత్తుకోవడమే కాదు.. ఎప్పుడు ఏదో విధంగా న్యూస్ లో ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. పవన్ కళ్యాణ్ దేవుడు అంటాడు. అలాగే ఏపీ సీఎం జగన్ సూపర్ అంటాడు. ఇక ఈమధ్యన కరోనా పాజిటివ్‌తో బాగా హైలెట్ అయిన బండ్ల గణేష్ తనకి నెగెటివ్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో హంగామా చేసాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ బాబు‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కామెడీ పాత్ర చేసి కామెడీ అయ్యాను అని అంటున్నాడు.

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వకుండా ఉండాల్సింది అంటున్నాడు. అసలు పచ్చిగా అంటే... రీ ఎంట్రీలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి పెద్ద తప్పు చేశానంటూ చెప్పుకొచ్చాడు. సరిలేరులో చేసిన పాత్ర నాకు ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. నాకు తెలిసిన వాళ్లందరు ఈ సినిమాలో అలాంటి పాత్ర ఎందుకు చేశావు అంటూ తనను తిట్టి పోసినట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఇక మీదట అలాంటి తప్పు చెయ్యను అంటున్నాడు. ఇక ఎప్పటికీ ప్రాధాన్యత లేని వేషాలు వేయనని అసలు ఇకపై యాక్టింగ్ చేయదలుచుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అంటే మనోడు ఎప్పుడు ప్రామిస్ చేసి తప్పినట్టుగానే ఇప్పుడు కూడా మళ్లీ యాక్ట్ చెయ్యను అంటూనే.. మంచి పాత్ర వస్తే నటించినా నటిస్తాడంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. 

Bandla Ganesh Sensational Comments on Sarileru Neekevvaru Role:

Bandla Ganesh Comments on His Role in Sarileru Neekevvaru 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ