ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ ఏమిటి అంటే చిరు ‘ఆచార్య’లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చెయ్యడమే కాదు.. చిరు తదుపరి చిత్రమైన ‘లూసిఫర్’ రీమేక్ లోను టాలీవుడ్, తమిళ నుండి బోలెడంతమంది నటినటుల పేర్లు వినబడుతున్నాయి. అది కూడా పాపులర్ నటుల పేర్లు. ‘లూసిఫర్’ రీమేక్‌లో చిరు చెల్లాయ్ పాత్రలో సుహాసిని, ఖుష్బూ, తాజాగా రోజా పేర్లు వినిపించాయి. ఇక లూసిఫర్‌లో కీలకమైన పృథ్వీరాజ్ పాత్రకి ముందు దగ్గుబాటి హీరో రానా ఫిక్స్ అన్నారు. అలాగే లూసిఫర్‌లో బాబీ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ ప్లేస్ లోకి జగపతిబాబుని తీసుకొస్తే .. ఇప్పుడు పృథ్వీరాజ్ పాత్రకి టాలీవుడ్ టాప్ హీరో విజయ్ దేవరకొండని చేర్చారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ తో ఫైటర్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. తర్వాత వరసగా సినిమాలు లైన్‌లో పెట్టిన విజయ్ దేవరకొండ చిరు సినిమాలో జస్ట్ గెస్ట్ రోలా అంటే సాధ్యమయ్యే పని కాదు.... సినిమాకి క్రేజ్ వస్తుంది అని పిలవడము కరెక్ట్ కాదు. ఆచార్య చరణ్ గెస్ట్ రోల్ అంటే... దాదాపుగా 30 నిమిషాల రోల్ గనక ఒకే.. కానీ లూసిఫర్ రీమేక్ లో పృథ్వీరాజ్ పాత్ర కేవలం మోహన్ లాల్ కి సెక్యురిటీగాను, అలాగే వివేక్ ఒబెరాయ్‌ని ట్రేస్ చేసేటప్పుడు, డ్రగ్స్ ఇండియాలోకి రాకుండా అడ్డుకునే టప్పుడు జస్ట్ యాక్షన్ సన్నివేశాల్లో తప్ప పృథ్వీరాజ్‌కి అంతగా కేరెక్టర్ లేదు. అలాంటి పాత్ర విజయ్ దేవరకొండ చేయడమా అంటూ అయన సన్నిహితులు అంటున్నమాట. అంటే చిరు - విజయ్ కాంబో జస్ట్ రూమర్ అని అర్ధమవుతుంది.