Advertisementt

పవన్- క్రిష్ సినిమా కోసం మరో రెండు టైటిల్స్..!

Wed 08th Jul 2020 02:19 PM
pawan kalyan,krish,tolywood,pspk  పవన్- క్రిష్ సినిమా కోసం మరో రెండు టైటిల్స్..!
Pawan Krish Movie titles are..? పవన్- క్రిష్ సినిమా కోసం మరో రెండు టైటిల్స్..!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ జరుపుకుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ గా రూపొందుతోంది. 

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్నాడట. మొఘలుల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాకి విరూపాక్ష అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే విరూపాక్ష అనే టైటిల్ బాగా ప్రచారంలోకి వెళ్ళింది కూడా. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమాకి మరో రెండు టైటిల్స్ ని అనుకుంటున్నారట. బందిపోటు, గజదొంగ అనే రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట.

అయితే పవన్ కళ్యాన్ ఛరిష్మాకి ఆ టైటిల్స్ ఏ విధంగా సరిపోతాయనేది సందేహంగా ఉంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి చిత్రబృందం టైటిల్స్ విషయంలో మళ్ళీ ఆలోచిస్తుందేమోనని అభిమానులు అనుకుంటున్నారు.

Pawan Krish Movie titles are..?:

Pawan Kalyan movie titles are..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ