Advertisementt

గ్యాప్ ఇవ్వలా.. బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిందంతే..!

Thu 09th Jul 2020 05:42 AM
tollywood,star directors,corona effect,sukumar,koratala siva,trivikram srinivas,anil ravipudi,sandeep vanga  గ్యాప్ ఇవ్వలా.. బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిందంతే..!
After Block Buster Movie.. star directors in Dilemma గ్యాప్ ఇవ్వలా.. బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిందంతే..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్స్ కి భారీ డిమాండ్ ఉంటుంది కానీ.. ఇప్పుడు డిమాండ్ సంగతి పక్కనబెడితే.. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన చాలామంది డైరెక్టర్స్ ఇప్పుడు తమ నెక్స్ట్ సినిమాలు మొదలెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. బ్లాక్ బస్టర్ ఇచ్చాక దాదాపుగా రెండేళ్లు గ్యాప్ వచ్చినా ప్రస్తుతం సినిమాలు చేద్దామని సెట్స్ మీదకెళ్ళిన డైరెక్టర్స్ అందరికి కరోనా షాకిచ్చింది. ముఖ్యంగా భరత్ అనే నేను చేసిన కొరటాల శివకి, రంగస్థలం చేసిన సుకుమార్ కి... తాజాగా అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ అందరూ ఖాళీగానే ఉన్నారు. ఇప్పుడు కొరటాల చిరు కోసం రెండేళ్లు టైం స్పెండ్ చేసి ఆచార్య పట్టాలెక్కించాక కరోనా అడ్డుకుంది.

ఇక సుకుమార్ అయితే రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ ని మెప్పించలేక రెండేళ్లు ఖాళీగానే ఉండి.. చివరికి బన్నీతో సినిమా మొదలు పెడితే.. కరోనా ముందుకు వెళ్లనివ్వడం లేదు. ఇక త్రివిక్రమ్ అయితే అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత మెరుపు వేగంగా ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాడు. కానీ కరోనాతో ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అలాగే సరిలేరు తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి పరిస్థితి అదే. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కానీ ప్రస్తుతం నెక్స్ట్ సినిమాపై ఇంకా సందిగ్ధం. ఇక భీష్మ హిట్ తర్వాత వెంకీ కుడుములు చడీ చప్పుడు లేదు. మరి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన ఈ డైరెక్టర్స్ అందరికి గ్యాప్ అయితే తప్పలేదు.

After Block Buster Movie.. star directors in Dilemma:

Star Directors in Tollywood Faces with Corona Troubles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ