బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న #BB3 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక కరోనా రావడం లాక్‌డౌన్ తో షూటింగ్ వాయిదా పడినప్పటికీ.. జూన్ లో బాలయ్య బాబు బర్త్‌డే కానుకగా బోయపాటి ఫాన్స్ కోసం ఓ పవర్ ఫుల్ టీజర్ ని బయటికి వదిలాడు. అంచనాలకు మించి లెజెండ్ అండ్ సింహా కన్నామించి ఉన్న #BB3 టీజర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై నెలలు గడుస్తున్నా ఇంతవరకు సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ విషయం కానీ.. .. టైటిల్ విషయం కానీ బయటపెట్టలేదు మూవీ టీం. అంతలో బాలయ్య - బోయపాటి టైటిల్ అంటూ మోనార్క్ ఒకటి, సూపర్ మ్యాన్ టైటిల్స్ ప్రచారంలోకి రావడం, హీరోయిన్‌గా అమలా పాల్ పేరు బయటికి రావడం జరిగింది.
అయితే తాజాగా బోయపాటి #BB3 పై వస్తున్న గాలి వార్తలపై స్పందించాడు. మా సినిమా హీరోయిన్స్ విషయంలో చాలా వార్తలొస్తున్నాయి. కానీ బయట ప్రఛారం జరుగుతున్నట్టుగా మా సినిమా హీరోయిన్స్ మీరనుకున్నవారు కాదు. అలాగే టైటిల్ విషయము అంతే. టైటిల్ ఇప్పటికే రెడీ అయ్యింది. అయితే ఇప్పుడే హీరోయిన్ విషయం కానీ, టైటిల్ విషయం కానీ చెప్పం. ఎందుకంటే అధికారికంగా ప్రకటిద్దామంటే.. ప్రస్తుతం కరోనా వలన పరిస్థితులు బాలేవు. హీరోయిన్ పేరు, టైటిల్ మంచి రోజు చూసుకుని ప్రకటిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు బోయపాటి.