Advertisementt

ప్రణీతకు నచ్చిన హీరోలు వీరేనంట..!

Wed 08th Jul 2020 08:48 AM
pranitha,chit chat,fans,pawan kalyan,ajith,ajay devgan,allu arjun,jr tr,favorite stars  ప్రణీతకు నచ్చిన హీరోలు వీరేనంట..!
Heroine Pranitha talks about her Favorite Star Heroes ప్రణీతకు నచ్చిన హీరోలు వీరేనంట..!
Advertisement
Ads by CJ

ప్రణీత టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ కాలేకపోయినా.. ప్రస్తుతం మాత్రం హీరోయిన్స్ అందరిలో టాప్ లెవల్లో 100 మెట్లు పైన ఉంది. సినిమాల్లో కెరీర్ పరంగా స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకోలేకపోయిన.. ప్రణీత సుభాష్ ప్రస్తుతం కరోనా వారియర్‌లా అందరి మన్ననలు పొందుతుంది. కరోనా లాక్‌డౌన్‌లో ఆకలితో అలమటిస్తున్న పెదలకి అన్నదానం చేస్తూ టాప్ హీరోయిన్స్‌కి షాకిచ్చింది. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ కూడా ఎలాంటి సహాయం చేయని టైం లో లక్షల్లో పారితోషకం అందుకుంటూ.. అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న ప్రణీత కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడం మాత్రం గర్వించదగిన విషయమే.

అయితే టాలీవుడ్‌లో ప్రణీత టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఎన్టీఆర్ రభస తోనూ, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలలో నటించిన ప్రణీతకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ప్రణీతకి తమిళ హీరో అజిత్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. తమిళం రాకపోయినా అజిత్ సినిమాలను చూస్తానంటుంది. బాలీవుడ్‌లో మాత్రం అజయ్ దేవగన్ అంటే చాలా ఇష్టపడే ప్రణీతకు టాలీవుడ్ హీరోస్‌లో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట. ఇక మహేష్ విషయానికొస్తే.. మహేష్ అందగాడని, ప్రభాస్ సూపర్ స్టార్ అని... రభసతో ఎన్టీఆర్‌తో నటించిన ప్రణీతకి జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్‌లా కనిపిస్తాడట. ఇక డ్యాన్స్ విషయానికొస్తే...  ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ ఇద్దరేనని ఒకరికి ఇంకొకరు తీసిపోరని చెబుతుంది. 

Heroine Pranitha talks about her Favorite Star Heroes:

Pawan Kalyan, Ajith and Ajay devgan are the Pranitha Subhash Favorite Heroes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ